ఐపీఎల్ - 2022 సంబంధించి కీలక ప్రకటన..!

దేశంలో కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇండియన్స్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2022 సీజన్ నిర్వహణపై బీసీసీఐ కసరత్తులు చేస్తోంది.ఈసారి లీగ్‌ లోకి కొత్తగా అహ్మదాబాద్, లక్నో రెండు జట్లు వచ్చి చేరడంతో 10 టీమ్స్‌తో ఈ సీజన్ అభిమానులను అలరించనుంది.

 Key Announcement Regarding Ipl - 2022 , Ipl2022, Sports Updates, Latest News, Viral Latest-TeluguStop.com

ఎట్టిపరిస్థితుల్లో ఈసారి భారత్‌ లోనే ఐపీఎల్ నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది.ఆ క్రమంలోనే లీగ్ నిర్వహణపై ప్రణాళికలు రూపొందిస్తుంది.ఐపీఎల్-2022 సీజన్ సొంతగడ్డపైనే ప్రారంభం అవుతుందని ఐపీఎల్ పాలకమండలి ఛైర్మన్ బ్రజేశ్ పటేల్ సూచనప్రాయంగా కూడా వెల్లడించారు.

అయితే, కోవిడ్.

 Key Announcement Regarding IPL - 2022 , Ipl2022, Sports Updates, Latest News, Viral Latest-ఐపీఎల్ #8211; 2022 సంబంధించి కీలక ప్రకటన..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగాయి.దీంతో ఇతర దేశాల్లో పెడదాం అనే ఆలోచన కూడా వచ్చింది.

ఈ నేప‌థ్యంలో క్రికెట్ అభిమానుల‌కు ఊర‌ట క‌ల్గించే వార్త ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది.బీసీసీఐ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు… ఐపీఎల్ ఇండియాలోనే జ‌ర‌గ‌నుందట.

అయితే ప్రతి సంవత్సరం లాగా.వేర్వేరు ప్రాంతాల్లో కాకుండా ఒకే దగ్గర ఐపీఎల్‌ను నిర్వ‌హించ‌డానికి బీసీసీఐ ప్లాన్ చేస్తోంద‌ట‌.

దీనికి ముంబైలోని 3 గ్రౌండ్ లలో ఈ ఐపీఎల్ లీగ్‌ను నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావిస్తోందని స‌మాచారం.ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డివై పాటిల్ స్టేడియాలు ఐపీఎల్ వేదిక‌లుగా మారనున్నట్లు తెలుస్తుంది.

Telugu Ipl, Latest, Ups-Latest News - Telugu

కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు చేరడంతో.మొత్తం 74 మ్యాచ్ లు జరగనున్నాయి.దాంతో.ముందుగా అనుకున్న తేదీ నుంచి కాకుండా కొద్దిగా ముందుకు జరిపి.మార్చి 25 నుంచే ఐపీఎల్ 2022 సీజన్ ను ప్రారంభించనున్నారు.ఇక మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అవ‌స‌ర‌మైతే పుణేలోనూ మ్యాచ్‌లు నిర్వ‌హించ‌డానికి బీసీసీఐ సిద్ధంగా ఉందంట‌.

ఒకే దగ్గర మ్యాచ్‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ప్ర‌యాణాలు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.అలాగే బ‌యోబ‌బుల్ వంటి స‌మ‌స్య‌లు కూడా తలెత్తవు.

దీంతో క‌రోనా సోకే అవ‌కాశాలు చాలా తక్కువ‌గా ఉంటాయ‌ని బీసీసీఐ భావిస్తోంద‌ని స‌మాచారం.అయితే దీనిపై బీసీసీఐ ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన‌ తుది నిర్ణ‌యం తీసుకోనుంద‌ని స‌మాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube