వర్ష వల్ల కొట్టుకున్న జబర్దస్త్ టీమ్ లీడర్లు.. ఏమైందంటే..?

ఈ మధ్య కాలంలో రియాలిటీ షో, కామెడీ షోల నిర్వాహకులు షోకు రేటింగ్స్ తగ్గితే ఏదో ఒక వివాదం సృష్టించి షోపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.కొన్నిసార్లు నిజంగానే వివాదం జరిగినా చాలా సందర్భాల్లో మాత్రం స్క్రిప్ట్ ప్రకారం వివాదాలను సృష్టిస్తున్నారు.

 Kevvu Karthika And Chalaki Chanti Fighting In Jabardasth Show, Anchor Roja, Chal-TeluguStop.com

తాజాగా ఎక్స్టా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా ఈ షోలో వర్ష వల్ల కెవ్వు కార్తీక్, చలాకీ చంటి మధ్య వివాదం చెలరేగింది.

వర్ష సరదాగా చేసిన పని కమెడియన్ల మధ్య గొడవకు కారణమైంది.

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డేగా జరుపుకుంటామనే సంగతి తెలిసిందే.స్కిట్ లో భాగంగా కెవ్వు కార్తీక్ వర్షతో అసలే ఎండలు స్టార్ట్ అయ్యాయండి గొంతంతా ఎండిపోతుంది అని చెప్పగా వర్ష ఏవండీ కారులో ఉంది తాగుతారా అని అడుగుతుంది.

తాగుతాను ఏముంది అని కెవ్వు కార్తీక్ బదులివ్వగా వర్ష ఏప్రిల్ ఫూల్ అని చెబుతుంది.

ఆ తరువాత రోజా మిమ్మల్ని మీరు ఫూల్ చేసుకోవడమేనా దమ్ముంటే జబర్దస్త్ టీమ్ లీడర్లను, కంటెస్టెంట్లను ఫూల్ చేయాలని రోజా చెబుతారు.

మొదట వర్ష ఆది రూమ్ లోకి వెళ్లి ఆదిగారు ఏం చేస్తున్నారు అని అడగగా ఆది ఏంటి టెన్షన్ పడుతున్నావ్ అని రివర్స్ లో ప్రశ్నిస్తారు.ఆ తరువాత వర్ష ఒకరిని గుద్దానండి అని చెప్పగా ఆది హారన్ కొట్టలేదా అని ప్రశ్నిస్తాడు.

ఎంత కొట్టినా పక్కకు జరగలేదండి వాడు ఫుట్ పాత్ మీద పడుకొని ఉన్నాడని వర్ష చెబుతుంది.

ఆ తరువాత చలాకీ చంటి వర్షను “నువ్వు ఆర్టిస్టువేనా.! డైలాగులు అనేవి కార్తీక్ చెబితే నేర్చుకోవడం కాదు సొంతంగా ప్రాక్టీస్ చేయాలి” అని వర్షకు చెబుతాడు.చంటి అలా అనడంతో ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లి చంటి తిట్టినందుకు ఆత్మహత్యాయత్నం చేస్తానని చెబుతారు.

ఆ తరువాత వర్ష ఏప్రిల్ ఫూల్ అని చెప్పగా చంటి సీరియస్ కావడంతో కెవ్వు కార్తీక్, చలాకి చంటి మధ్య గొడవ జరుగుతుంది.మరి గొడవ తర్వాత ఏమైందో తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube