శ్రీదేవి డ్రామా కంపెనీ.. అందరినీ కన్నీళ్లు పెట్టించిన కెవ్వు కార్తీక్.. ఏం జరిగిందంటే?

Kevvu Karthik Touches Hearts With His Performance In Sridevi Drama Company

బుల్లితెరపై ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలే మొదలైన ఈ షో జోష్ ఫుల్ గా దూసుకుపోతుంది.

 Kevvu Karthik Touches Hearts With His Performance In Sridevi Drama Company-TeluguStop.com

ఈ షోకు యాంకర్ గా సుడిగాలి సుధీర్ చేస్తుండగా, జడ్జిగా ఇంద్రజ వ్యవహరిస్తోంది.ఈ షోలో పలువురు కమెడియన్లు ఒకవైపు జబర్దస్త్ లో నటిస్తూనే మరొకవైపు ఈ షోలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

అయితే బుల్లితెరపై ఇటీవలే మొదలైన ఈ షో ఊహించిన దాని కంటే ఫుల్ జోష్ దూసుకుపోతోంది.అయితే మొదట్లో ఈ షోపై పలువురు చాలా రకాల విమర్శలు కూడా చేశారు.

 Kevvu Karthik Touches Hearts With His Performance In Sridevi Drama Company-శ్రీదేవి డ్రామా కంపెనీ.. అందరినీ కన్నీళ్లు పెట్టించిన కెవ్వు కార్తీక్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటగా ఈ షో మీద అందరికీ నెగిటివిటీ ఏర్పడింది.ఈ షోలో సుధీర్ రెండు మూడు సార్లు కంపెనీ అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు వాడారు.

ఆ తరువాత సుధీర్ హోస్ట్ గా రావడంతో ఈ షో అలా పైకి లేచింది.అలా సుధీర్ మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీని అలా నిలబెట్టి చేశాడు.

ఈ షోలో హైపర్ ఆది, రాంప్రసాద్, వర్ష, ఇమ్మాన్యుయేల్, గెటప్ శీను పలువురు జబర్దస్త్ కమెడియన్లు నటిస్తున్నారు.అయితే ఎప్పటిలాగే వచ్చే ఆదివారం కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు.

అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తాజాగా విడుదల చేశారు.

అయితే వచ్చే ఆదివారం ఎపిసోడ్ ను రజనీకాంత్ కోసం చేశారు.రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా అందరూ అదే స్టైల్ ను ఫాలో అయ్యారు.రజినీకాంత్ గారు వేసిన గెటప్ లు వేసి ప్రేక్షకులను నవ్వించారు.

ఈ క్రమంలోనే కమెడియన్ కార్తీక్ డిఫరెంట్ గా ఆలోచించి మరుగుజ్జు వాళ్లకోసం, వారిలా గెటప్ వేసుకొని ఒక స్కిట్ చేశాడు.అయితే మరుగుజ్జుల స్కిట్ చేయడం కోసం కార్తీక్ చాలా కష్టపడ్డాడు అనిపిస్తోంది.

స్కిట్ లో భాగంగానే కార్తీక్ ప్రేమించిన అమ్మాయి వదిలి వెళ్ళిపోతుంది.అప్పుడు కార్తీక్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? అని అడగగా నిన్ను ఆ దేవుడే ఇలా మధ్యలో వదిలేసాడు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తుంది.అమ్మాయితో ఏడు అడుగులు నడవాలంటే ఆరడుగుల పొడవు ఉండాలని మా అమ్మానాన్నలకు తెలియదేమో అందరూ నా ఆకారాన్ని చూస్తున్నారు కానీ నా మనసు చూడడం లేదు ఏంటిరా అంటూ అందరినీ ఏడిపించేసాడు.

#Emanuel #SrideviDrama #Sudheer #Rajini Kanth #Kevvu Karthika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube