వైట్ హౌస్ నుంచీ కెవిన్ నిష్క్రమణ...!!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన నాటినుంచీ, నేటి వరకూ ఎంతో మంది వైట్ హౌస్ లో కీలక అధికారులు ఒక్కొక్కరుగా వైదొలగుతూనే ఉన్నారు.వారిలో కూడా అమెరికాకి ఎంతో ప్రాధాన్యమైన శాఖలలో అత్యంత కీలక పాత్ర పోషించే వారు ఒక్కొక్కరుగా వైదొలగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 Kevin Went Out From White House-TeluguStop.com

అయితే తాజాగా శ్వేత సౌధం కీలక ఆర్ధిక వేత్త తన పదవినుంచీ తొలగడం అందులోనూ ప్రస్తుత వాణిజ్య యుద్ధ సమయంలో ఆయన తప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

వైట్ హౌస్ నుంచీ కెవిన్ నిష్క్�

వైట్ హౌస్ ఉన్నత ఆర్ధిక వేత్తగా కెవిన్ కి మంచి పేరు ఉంది.ఆర్ధికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కెవిన్ దిట్ట.కెవిన్ 2017 నాటి రిపబ్లికన్‌ పన్నుల చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

అయితే ఆయన వైదొలగుతారని ట్రంప్ ప్రకటించడం సంచలన సృష్టించింది.అయితే కెవిన్‌ తనకు, తమ ప్రభుత్వానికి అపారమైన సేవలు అందించారని,ప్రతిభాశాలి అంటూ ట్రంప్ ట్విట్టర్ లో తెలిపారు.

కెవిన్ తనకి మంచి మిత్రుడని పేర్కొన్న ట్రంప్, ఆయన్ని ఉన్నపళంగా అందులోనూ , మెక్సికో, చైనాలపై అమెరికా ఏకపక్షంగా వాణిజ్యయుద్ధం జరుగుతున్న సమయంలో, తప్పుకోవడం ఎన్నో అనుమానాలకి తావిస్తోందని స్థానిక మీడియా తెలిపింది.57 ఏళ్ల కెవిన్‌ 2017 సెప్టెంబర్ నుంచీ ఆర్థిక సలహాదారుల మండలి ఛైర్మన్‌గా పనిచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube