శౌర్యతో రెచ్చిపోతానంటోన్న రొమాంటిక్ బ్యూటీ

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవల కాలంలో వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇందులో కొన్ని హిట్లుగా నిలుస్తుంటే, మరికొన్ని ఫ్లాపులుగా నిలుస్తున్నాయి.

 Ketika Sharma To Play Opposite Naga Shaurya, Ketika Sharma, Romantic, Naga Shaur-TeluguStop.com

అయితే ఛలో సినిమా నాగశౌర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఆ సినిమా స్థాయిలో మళ్లీ సక్సెస్ కొట్లేకపోతున్నాడు ఈ కుర్ర హీరో.

ఎంచుకునే కథలు బాగున్నా, వాటిని తెరకెక్కించే తీరులో లోపం ఉండటంతో బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాడు.

ఇక తాజాగా తన నెక్ట్స్ మూవీని ఓకే చేశాడు ఈ హీరో.

ఇటీవల అశ్వద్ధామ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన నాగశౌర్య, ఈసారి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రానికి ఓటేశాడు.సంతోష్ జాగర్లపూడి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో నాగశౌర్య ఈ సినిమాకు పచ్చ జెండా ఊపేశాడు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ నటించనుంది.ఈ మేరకు చిత్ర యూనిట్ ఆమెను ఓకే కూడా చేసుకుంది.

రొమాంటిక్ చిత్రంలో కేతిక అందాల ఆరబోత అదిరిపోయిందని చిత్ర రషెస్ చేస్తూ తెలుస్తోంది.దీంతో ఆమెను ఈ సినిమాలో తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించారు.

అనుకున్నదే ఆలస్యం వారు ఈ సినిమాలో ఆమెను ఓకే చేశారు.మొత్తానికి నాగశౌర్య ఈసారి కాస్త ఘాటైన రొమాన్స్ కూడా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

మరి ఈ సినిమాలో శౌర్య, కేతిక శర్మల కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube