రొమాంటిక్ బ్యూటీ కేతిక కోరిక మాములుగా లేదుగా.. ఎవరు తీరుస్తారో?

ఆకాష్ పూరి హీరోగా నటించిన రోమాంటిక్  సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.

 Kethika Sharma, Naga Shaurya, Lakshya, Tollywood,latest News-TeluguStop.com

అలాగే తన అందచందాలతో కుర్రకారుని కట్టిపడేసింది.రోమాంటిక్ సినిమా తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లు అందుకునే ఫుల్ బిజీ అయిపోయింది.

ఈ క్రమంలోనే కేతిక శర్మ నటించిన తాజా చిత్రం లక్ష్య.ఈ సినిమాలో నాగ శౌర్య హీరోగా నటించారు.

ఈ సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, నారాయణ దాస్ నారంగ్., రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా డిసెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే హీరోయిన్ కేతిక శర్మ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

రోమాంటిక్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన చివరి రోజున దర్శకుడు సంతోష్ లక్ష్య సినిమా కథను నెరేట్ చేశారు.ఒక షూటింగ్ పూర్తి అవగానే మరోక కథ రావడం ఆనందంగా అనిపించింది అని ఆమె తెలిపింది.

అలాగే రోమాంటిక్ సినిమాలో చేసిన పాత్రకు,లక్ష్య సినిమాలో పాత్రకు అసలు సంబంధం ఉండదు.అందువల్లే ఈ సినిమాను చేయడానికి నేను అంగీకరించానని తెలిపింది.

ఇక ఈ సినిమాలో నా పాత్ర పేరు రితిక.హీరో పాత్రపేరు పార్థు.

నేను ఇందులో ప్రేమించే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను అని ఆమె తెలిపింది.

Telugu Kethika Sharma, Lakshya, Naga Shaurya, Tollywood-Movie

అలాగే రోమాంటిక్ సినిమాలో నేను ఒక పాట పాడాను.ప్రస్తుతం నటించిన లక్ష్య సినిమా వాళ్లు కూడా నన్ను పాడమని చెప్పారు.నా పాత్రకు చిన్మయి గారి డబ్బింగ్ చెప్పారు.

త్వరలోనే నేను తెలుగులో డబ్బింగ్ చెబుతాను అని తెలిపింది కేతికశర్మ.అలాగే నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం.

నేను స్టేట్ లెవెల్ స్విమ్మర్.మా అమ్మ నేషనల్ లెవెల్ స్విమ్మర్.

నాకు స్విమ్మింగ్ బేస్ సినిమా వస్తే చేస్తాను అంటూ తన మనసులోని మాట బయట పెట్టేసింది కేతిక.మరి స్పోర్ట్స్ బేస్ మూవీ లో చేయాలి అన్నా కేతిక శర్మ కోరికను ఎవరు తీరుస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube