మళ్లీ రచ్చ చేస్తున్న వర్మ.. నేను సిద్దమంటున్న కేతిరెడ్డి     2018-10-20   09:47:00  IST  Ramesh Palla

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో మీడియాలో ఉంటూనే ఉంటాడన్న విషయం తెల్సిందే. తాను చేసే ప్రతి సినిమాను కూడా వివాదాస్పదంగా మార్చగల సమర్ధుడు ఆయన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తీస్తానంటూ బయలుజేరాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ విషయంలో తాను చాలా సీరియస్‌గా ఉన్నట్లుగా వర్మ తాజాగా మరోసారి ప్రకటించాడు. కొన్ని నెలల క్రితం వర్మ ఎన్టీఆర్‌ బయోపిక్‌ను ప్రకటించి, ఎలాంటి ముందడుగు వేయక పోవడంతో వర్మ సినిమా క్యాన్సిల్‌ చేసుకున్నాడేమో అనుకున్నారు. కాని అనూహ్యంగా వర్మ తాజాగా వర్మ మరోసారి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను ప్రకటించాడు.

Kethireddy Jagadishwar Reddy Comments On Lakshmi's NTR-

Kethireddy Jagadishwar Reddy Comments On Lakshmi's NTR

బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం విడుదల కాబోతున్న జనవరి 24న విడుదల చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. ఒకేరోజు ఒకే వ్యక్తికి చెందిన రెండు బయోపిక్‌లు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను ఎలాంటి వివాదాలు లేకుండా క్రిష్‌ తీస్తున్నాడు, కాని వర్మ మాత్రం కేవలం వివాదాన్ని తీసుకుని ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తీయబోతున్నాడు. క్రిష్‌ ‘ఎన్టీఆర్‌’లో చంద్రబాబు నాయుడు హీరోగా కనిపించబోతున్నాడు, కాని వర్మ ‘ఎన్టీఆర్‌’లో మాత్రం చంద్రబాబు విలన్‌గా కనిపించబోతున్నాడు.

Kethireddy Jagadishwar Reddy Comments On Lakshmi's NTR-

వర్మ ఎప్పుడైతే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ అంటున్నాడో అప్పుడే చంద్రబాబు అభిమాని అయిన కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి తన ‘లక్ష్మీస్‌ వీరగ్రంధం’ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించాడు. వర్మ ఎన్టీఆర్‌ బయోపిక్‌ అంటూ తీస్తే నేను కూడా తాను ప్రకటించిన వీరగ్రంధం చిత్రాన్ని చేస్తానంటూ తాజాగా ప్రకటించాడు. వీరగ్రంధం చిత్రంపై లక్ష్మీ పార్వతి గతంలోనే సీరియస్‌ అయ్యింది. వర్మ సందడి చేస్తున్న సమయంలో కేతిరెడ్డి కూడా మీడియా ముందుకు రావడం చర్చనీయాంశం అవుతుంది. మొత్తానికి ఈ వ్యవహారం ఎక్కడకు దారి తీస్తుందో అంటూ నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.