గీతా ఆర్ట్స్ లో రొమాంటిక్ హీరోయిన్..!

డబ్ స్మాష్ లో అదరగొట్టిన ఢిల్లీ భామ కెతిక శర్మ ఆకాష్ పూరీ హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.టైటిల్ కు తగినట్టుగానే రొమాంటిక్ సినిమాలో అమ్మడు ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.

 Kethika Sharma Lucky Chance In Geetha Arts, Allu Aravind, Geetha Arts, Kethika S-TeluguStop.com

ఆకాష్ పూరీ, కెతిక శర్మల రొమాన్స్ ఆ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.ఇక స్టార్ హీరోయిన్ క్వాలిటీస్ కచ్చితంగా ఉన్నాయనిపించేలా ఉన్న కెతిక శర్మ మొదటి సినిమా రిలీజ్ అవకుండానే సెకండ్ సినిమా ఛాన్స్ అందుకుంది.

నాగ శౌర్య లక్ష్య సినిమాలో కూడా కెతిక శర్మ ఛాన్స్ దక్కించుకుంది.

ఇక ఇదే ఊపులో మెగా ఆఫర్ పట్టేసింది కెతిక శర్మ.

గీతా ఆర్ట్స్ చేస్తున్న నెక్స్ట్ సినిమాలో అమ్మడు లక్కీ ఛాన్స్ కొట్టేసిందని టాక్.ఈమధ్య బడీ బడ్జెట్ సినిమాలతో పాటుగా మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తున్న గీతా ఆర్ట్స్ లో నెక్స్ట్ సినిమా యువ హీరోతో ఒక క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమాలో కెతిక శర్మకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.చూస్తుంటే అమ్మడు టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ దక్కించుకునేలా ఉందని చెప్పొచ్చు.

 గీతా ఆర్ట్స్ తో పాటుగా మరో రెండు సినిమాల్లో కూడా కెతిక శర్మ ఆఫర్ అందుకుందని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube