విప్ పదవిని తిరస్కరించిన నాని...కారణం!

టీడీపీ నేత కేశినేని నాని టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి గట్టి షాక్ ఇచ్చారు.లోక్ సభ లో పార్టీ విప్ గా నియమించిన బాబుకు ధన్యవాదాలు తెలిపి పదవి స్వీకరించడానికి సిద్ధంగా లేనని చెప్పి తప్పుకున్నారు.

 Kesineni Nani Rejected The Whip Post-TeluguStop.com

అంతేకాకుండా అంత పెద్ద పదవికి తాను అర్హుడని కాను అంటూ నేను ఆ భాద్యతలు స్వీకరించలేను అంటూ నాని తప్పుకున్నట్లు తెలుస్తుంది.అయితే అసలు విషయం ఏంటో అర్ధం కాక టీడీపీ వర్గాలు ఆలోచనలో పడ్డాయి.

కొద్దీ రోజుల క్రితం నాని కేంద్ర మంత్రి,బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ ని కలిసిన సంగతి తెలిసిందే.అయితే అప్పటి నుంచి కూడా నాని బీజేపీ లో చేరుతున్నారు అంటూ వార్తలు షికారు చేశాయి.

అయితే ఆ వార్తల పై నాని ఎప్పుడూ కూడా పెదవి విప్పకపోవడం తో అందరూ మిన్నకున్నారు.

-Telugu Political News

కానీ ఇప్పుడు లోక్ సభ పార్టీ విప్ పదవి ఇచ్చినప్పటికీ నాని దానిని తిరస్కరించడమే కాకుండా అంత పెద్ద పదవికి నేను అర్హుడని కాను అంటూ ఏకంగా పార్టీ అధిష్టానం పై సెటైర్ వేయడం తో ఇప్పుడు ఆ వార్తలలో బలం ఏర్పడినట్లు అయ్యింది.ఆయన వ్యాఖ్యలను బట్టి ఆయన త్వరలో టీడీపీ కి గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే బాబు ఆఫర్ ఇచ్చినప్పుడు మాత్రం విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని తెలిపి పక్కకు తప్పుకున్నారు.

అయితే ఆయన ఎప్పుడు టీడీపీ కి గుడ్ బై చెబుతారా,ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని టీడీపీ వర్గాలు ఆలోచనలో పడ్డాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube