మరోసారి పేస్ బుక్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన నాని  

Kesineni Nani One Post In Face Book-

గత కొద్దీ రోజులుగా టీడీపీ పై అసంతృప్తి తో ఉన్న నేత కేశినేని నాని మరోసారి పేస్ బుక్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల శ్రీ శ్రీ వ్యాఖ్యలు పోస్ట్ చేసి వార్తలలో నిలిచిన నాని ఇప్పుడు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలతో పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.నేను స్వయం శక్తిని నమ్ముకున్న వ్యక్తిని,అని ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదంటూ పోస్ట్ పెట్టారు...

Kesineni Nani One Post In Face Book--Kesineni Nani One Post In Face Book-

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓటమి పాలైన తరువాత నాని వ్యవహార శైలి లో మార్పు వచ్చింది.

Kesineni Nani One Post In Face Book--Kesineni Nani One Post In Face Book-

లోక్ సభ విప్ గా టీడీపీ అధినేత అవకాశం ఇచ్చినా నేను ప్రజలకు సేవ చేయాలనీ అనుకుంటున్నానని, ఈ పదవికి అర్హులు అయిన వారిని నియమించాలి అంటూ పక్కకు తప్పుకున్నారు.ఈ క్రమంలో బాబు ఫోన్ లో సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ నాని ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ పదవికి నేను అర్హుడను కాను అంటూ ఆఫర్ ని తిరస్కరించారు.బాబు తో ఫోన్ మాట్లాడిన తెల్లారే శ్రీశ్రీ వ్యాఖ్యలతో నాని పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్ లో పోరాడతాను అని నాని వ్యాఖ్యానించడం తో టీడీపీ పై అసంతృప్తి తో ఉన్నారు అన్న విషయం తేటతెల్లమైంది.అయితే ఇంకా ఆ పోస్ట్ వివాదం పై క్లారిటీ రాకుండానే తాజాగా మరోసారి పేస్ బుక్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తినని..

ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదని అన్నారు.నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం.

అన్యాయాన్ని అన్యాయమని చెప్పడంలో నేను ఎప్పుడూ వెనకడుగు వేయబోనని, నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టానని నాని గుర్తు చేసుకున్నారు.అలానే భయం నా రక్తంలో లేదని.రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదని కామెంట్ పెట్టారు.మరోపక్క నాని బీజేపీ లో చేరతారన్న వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి.గతంలో ఆయన నితిన్ గడ్కరీ ని కలిశారని తప్పకుండా పార్టీ ఫిరాయిస్తారని అందుకే టీడీపీ పై ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.