నాని ట్విట్టర్ ఖాతా నుంచి మరో సంచలన ట్వీట్  

Kesineni Nani Comments On Chandrababu-

గత కొద్దీ రోజులుగా టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేసే ట్వీట్స్ ఎప్పుడు ఎవరిపై ఉంటాయో అన్న విషయం కూడా అర్థకావడం లేదు అటు అధికార పార్టీకి, ఇటు సొంత పార్టీకి. ఒకరోజు అధికార పార్టీ పై ఆ నేతలపై విమర్శలు చేసే ఆయన షడన్ గా సొంత పార్టీ పై కూడా చురకలు అంటిస్తున్నారు..

నాని ట్విట్టర్ ఖాతా నుంచి మరో సంచలన ట్వీట్ -Kesineni Nani Comments On Chandrababu

నిన్న ఆయన చేసిన ట్వీట్ నిజంగా అధికార పార్టీ పైన నా లేదంటే సొంత పార్టీ లో ఉన్న మాజీ మంత్రి,టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు అయిన నారా లోకేష్ పైనా అన్న సందేహం కలగకమానదు. అయితే ఈ సారి తాజా ట్వీట్ లో నేరుగా అధినేతనే ప్రశ్నించారు.

‘నేను పార్టీలో ఉండాలా వద్దా మీరే నిర్ణయించండి’ అంటూ ట్వీట్‌ చేశారు. ‘చంద్రబాబు గారూ. నాలాంటి వ్యక్తులు మీ పార్టీలో ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తా’ అని, ‘ఒకవేళ నేను పార్టీలో కొనసాగాలని మీరు భావిస్తే. మీ పెంపుడు కుక్కను అదుపులో పెట్టండి’ అంటూ సంచలన ట్వీట్ చేశారు. గత రెండు రోజులుగా కేశినేని నాని – టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య ట్వీట్‌ వార్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేసుకున్నారు.

ఈ క్రమంలో ఇవాళ కేశినేని నాని ఈ ట్వీట్‌ చేయడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. నేరుగా అధినేతనే ప్రశ్నిస్తూ నాని ట్వీట్ చేయడం ఇప్పుడు ఆ పార్టీ లో అంతర్గత విభేదాలు తలెత్తాయి అన్న దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చవిచూసిన తరువాత ఆ పార్టీ నుంచి పలువురు ఎంపీలు,నేతలు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే..

అయితే గత కొద్దీ రోజులుగా సొంత పార్టీ పై అసంతృప్తి తో ఉన్న కేశినేని కూడా పార్టీ ఫిరాయిస్తారని, బీజేపీ లో చేరిపోతారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ప్రచారం పై నాని క్లారిటీ కూడా ఇచ్చారు, నాకు పార్టీ మారె ఉద్దేశ్యం లేదని తేల్చి కూడా చెప్పారు.

కానీ సొంత పార్టీ పై, ఆ పార్టీ నేతలపై మాత్రం నాని విమర్శలు మాత్రం మానుకోవడం లేదు. మరి ఈ విమర్శల వెనుక ఉన్న అసలు కారణం మాత్రం తెలియడం లేదు.

మరి దీనిపై అధినేత ఎలా స్పందిస్తారో మరి ఎలాంటి బుజ్జగింపు చర్యలు చేపడతారో చూడాలి. ఇప్పటికే పార్టీ అస్తమయం మయ్యే ప్రమాదంలో ఉన్న ఈ సమయంలో నాని వరుస ట్వీట్స్ బాబు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. మరి చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..