ట్విట్టర్ వేదికగా జంప్ జిలానీల పై ఫైర్ అయిన టీడీపీ ఎంపీ  

Kesineni Nani Comments On Party Change Mp\'s-

టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని గత కొద్దీ రోజులుగా ట్విట్టర్ లో ఏక్టివ్ గా ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఆయన మీడియా తో మాట్లాడడం కన్నా కూడా ట్విట్టర్ వేదికగా ఎవరినైనా కూడా ప్రశ్నిస్తున్నారు.మొన్నటికి మొన్న ట్విట్టర్ వేదికగానే ఏపీ సీఎం జగన్ పై ఆరోపణలు చేసిన ఆయన ఇప్పుడు తాజాగా టీడీపీ పార్టీ నుంచి బీజేపీ లోకి జంప్ చేసిన ఎంపీలపై విమర్శలు గుప్పించారు...

Kesineni Nani Comments On Party Change Mp\'s--Kesineni Nani Comments On Party Change MP's-

మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్దరించడానికి బీజేపీ లోకి వెళుతున్నామని తెగ బిల్డప్ ఇచ్చారు.కానీ నిన్న కేంద్రం విడుదల చేసిన బడ్జెట్ ను చూశాక మాత్రం ఏపీ రాష్ట్ర ప్రజలకు మీరెందుకు పార్టీ మారారు అన్న విషయం బాగా అర్ధమయ్యింది.రాష్ట్రాన్ని ఉద్దరించడానికి బీజేపీ లో చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్దరించుకోవడానికి బీజేపీ లో చేరారో అన్న విషయం అర్ధం అవుతుంది అంటూ వారిపై ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి చేశారు.

Kesineni Nani Comments On Party Change Mp\'s--Kesineni Nani Comments On Party Change MP's-

రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు లు ఇటీవల బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే.అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తాము బీజేపీలో చేరామంటూ తాము ఆ పార్టీ లో చేరడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నాని ట్విట్టర్ వేదికగా వారిపై విమర్శలు గుప్పించారు.