చంద్రబాబు దీక్ష స్థలంలో కేశినేని నాని ..!!

Keshineni Nani At Chandrababu Deeksha Place

విజయవాడ ఎంపీ కేశినేని నాని నిరసన దీక్షలో పాల్గొన్నారు.దీక్ష చేపడుతున్న చంద్రబాబు ని పరామర్శించారు.

 Keshineni Nani At Chandrababu Deeksha Place-TeluguStop.com

కాసేపు ఆయనతో వేదికపై కూర్చుని ముచ్చటించారు.మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం 36 గంటల చంద్రబాబు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు వస్తూ అధికార పార్టీ వైసీపీ పై మండి పడుతున్నారు.

ఇదిలావుంటే ఇటీవల గత కొన్ని రోజుల నుండి కేసినేని నాని తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తన పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ఫోటోతో పాటు మరి కొంతమంది టీడీపీ కీలక నాయకులు ఫోటోలను తొలగించినట్టు వార్తలు వచ్చాయి.
అంతేకాకుండా రానున్న ఎన్నికలలో కేశినేని నాని ఎప్పుడూ కూడా టీడీపీ నుండి పోటీ చేసే అవకాశం లేదు… అనే టాక్ వినిపించింది.

 Keshineni Nani At Chandrababu Deeksha Place-చంద్రబాబు దీక్ష స్థలంలో కేశినేని నాని ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటువంటి తరుణంలో చంద్రబాబు తలపెట్టిన నిరసన దీక్షకి… కేసినేని రావటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో సొంత పార్టీకి చెందిన నాయకులు తనకు వ్యతిరేకంగా మారిన సమయంలో చంద్రబాబు వాళ్ళను మందలించకుండా ఉండటం తో… కేశినేని నాని పార్టీకి దూరం అయినట్లు వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా చంద్రబాబు దీక్షకి ఆయన హాజరు కావడంతో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం నెలకొంది.

#KeshineniNani #YCP #Keshineni Nani #Chandrababu #TDP Attack

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube