ఆ ఒక్కటి అడక్కు అంటున్న ప్రభుత్వం, కార్మికులకు అదే కావాలట  

Keshavarao Spoke With Rtc Workers Demands-telangana Cm Kcr Strict In Rtc Workers Issue,telangana Rtc Strike

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్రతరం అవుతోంది.ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వం కూడా కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది.తాజాగా కేశవరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.

Keshavarao Spoke With Rtc Workers Demands-telangana Cm Kcr Strict In Rtc Workers Issue,telangana Rtc Strike-Keshavarao Spoke With RTC Workers Demands-Telangana Cm Kcr Strict In Rtc Issue Telangana Strike

అయితే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంకు మాత్రం ప్రభుత్వం సిద్దంగా లేదని, ఇతర అన్ని డిమాండ్లకు తాము ఒకే చెప్తామంటూ ఈ సందర్బంగా కేశవరావు అన్నాడు.మరో వైపు ఆర్టీసీ కార్మికులు కూడా ఈ విషయమై స్పందించారు.నేడు కార్మి సంఘాల జేఏసీ నాయకులు గవర్నర్‌తో భేటీ అయ్యారు.ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించారు.అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.ఒక వైపు కార్మికులు డ్యూటీలో జాయిన్‌ అయితే చర్చలకు సిద్దం అంటూ ప్రకటించగా, మరో వైపు కార్మికులు మాత్రం అదే డిమాండ్‌తో ఉన్నారు.

ఇక ప్రభుత్వం ప్రత్యామ్యాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తోంది.