కేరింత సినిమా భావన ఇప్పుడెలా ఉందో తెలుసా...?  

ఒక్కసారి కొంతమంది నటులు అనుకోకుండా సినిమా పరిశ్రమకు వచ్చి తళుక్కున మెరిసే ఫేమ్ వచ్చినప్పటికీ ఎందుకో తెరమరుగైన నటీ నటులు చాలా మంది సినిమా పరిశ్రమలో ఉన్నారు.అయితే 2015 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి దర్శకత్వం వహించిన “కేరింత” అనే చిత్రంలో “భావన” పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టువంటి తెలుగు యంగ్ హీరోయిన్ “సుకృతి” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Kerintha Movie Fame Sukrithi Career And Real Life News-TeluguStop.com

ఈ చిత్రంలో భావన అనే డైలాగుతో సుకృతి బాగానే పాపులర్ అయ్యింది.దీనికి తోడు పల్లెటూరి నుంచి వచ్చినటువంటి యువకుడితో ప్రేమలో పడటం మరియు అతడికి చదువు సంధ్యలలో సహాయం చేయడం వంటి వాటి కారణంగా ఈ అమ్మడి పాత్రకి ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు.

దీంతో సుకృతి కి బాగానే ఫేమ్ వచ్చింది.

 Kerintha Movie Fame Sukrithi Career And Real Life News-కేరింత సినిమా భావన ఇప్పుడెలా ఉందో తెలుసా…  -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఏమైందో ఏమో గానీ సుకృతి కేరింత చిత్రంలో నటించిన తర్వాత మళ్ళీ తెలుగు చిత్రాలలో నటించలేదు.

కాగా ఈ చిత్రంలో నటించిన తర్వాత సుకృతి తన చదువు పై దృష్టి సారించినట్లు సమాచారం.అయితే సుకృతి దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పుట్టి పెరిగింది.

దీంతో ఈ అమ్మడు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి భనస్థలి యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్ చదువుని పూర్తి చేసింది.కాగా ఈ మధ్య కాలంలో సుకృతి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు హెర్బల్ కంపెనీల ఉత్పత్తుల కూడా ప్రమోట్ చేస్తోంది.కాగా చీర కట్టులో కనిపించి కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న సుకృతి కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే ఈ అమ్మడి చదువు పూర్తవడంతో ప్రస్తుతం సుకృతి డిజిటల్ క్రియేటర్ గా పనిచేస్తోంది.అంతేకాకుండా సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి డిజిటల్ మీడియా ప్లాట్ ఫారం లో కూడా బాగానే అలరిస్తోంది.

మరి సుకృతి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుందో లేక నటనకు స్వస్తి చెప్పి ఉద్యోగంలో సెటిల్ అవుతుందో చూడాలి.

#SukrithiCareer #Sukrithi #KerinthaMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు