బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచే సత్తా ఆమెకే ఉందట, కిరీటి జోష్యం

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 మెల్ల మెల్లగా ఆసక్తికరంగా మారుతోంది.మొదటి మూడు వారాల పాటు సాదాసీదాగా సాగుతూ వచ్చిన షోకు మరింత మసాలా జోడిస్తూ ముందుకు తీసుకు వెళ్తున్నారు.

 Kereti Opens About Big Boss 2 Telugu Winner-TeluguStop.com

బిగ్‌బాస్‌కు ప్రేక్షకులు మెల్లగా అలవాటు పడిపోతున్నారు.ఇక నాని కూడా హోస్టింగ్‌తో మెప్పిస్తున్నాడు.

మొదటి వారంతో పోల్చితే తాజాగా జరిగిన ఎపిసోడ్స్‌లో నాని హోస్టింగ్‌ చాలా మెచ్యూర్డ్‌గా అనిపించింది.భారీ అంచనాల నడుమ ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో ఇప్పటి వరకు ముగ్గురు ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే.

మొదటి రెండు వారాలు సామాన్యులు ఎలిమినేట్‌ అవ్వగా, మూడవ వారంలో కిరీటి ఎలిమినేట్‌ అవ్వడం జరిగింది.ఇక ఈ వారం గణేష్‌ ఎలిమినేట్‌ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.గత వారం ఇంటి నుండి బయటకు వచ్చేసిన కిరీటి పలు టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.ఆ సందర్బంగా కిరీటి మాట్లాడుతూ బిగ్‌బాస్‌ ఇంటికి సంబంధించిన పలు విషయాలను బయట పెడతున్నాడు.

ఎప్పటిలాగే, అందరిలాగే ఇంటి సభ్యులు మంచి వారు, ఇంట్లో చిన్న చిన్న ఇష్యూలు జరగడం కామన్‌, అయితే వాటిని అప్పటికప్పుడు మర్చిపోతామని, అయితే ప్రేక్షకులు టీవీలో చూసినదానికి అక్కడ ఉండేదానికి తేడా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ గురించి కిరీటి మాట్లాడుతూ ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఆ ఛాన్స్‌ ఉందని, వారిలో తనకు ఎక్కువగా అనిపిస్తున్న కంటెస్టెంట్‌ తేజస్వి.

ఈమెకు మాత్రమే బిగ్‌బాస్‌ విన్నర్‌ అయ్యే సత్తా, స్టామినా ఉన్నట్లుగా తనకు అనిపిస్తుందని ఈ సందర్బంగా కిరీటి చెప్పుకొచ్చాడు.తప్పకుండా బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో తాను అనుకున్నట్లుగా తేజస్వి గెలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నాడు.

తేజస్వికి ప్రేక్షకుల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగా ఉండటంతో పాటు, ఆమె ప్రచారం కోసం ప్రత్యేకంగా టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

పక్కా ప్రణాళికతో తేజస్వి బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగు పెట్టింది.

అందుకే ఖచ్చితంగా తేజస్వికి విన్నర్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న బాబు గోగినేని మరియు గీతామాధురికి కూడా మంచి ఆధరణ ఉంది.

వారాలు గడుస్తున్న కొద్ది ఇంకా కూడా బలమైన పార్టిసిపెంట్స్‌ పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది.అయితే బిగ్‌బాస్‌లో ఏదైనా సాధ్యమే, విజేత అనుకుంటున్న వారు కూడా ఏదైనా చిన్న ఇన్సిడెంట్‌తో ఎలిమినేట్‌కు నిలిచే అవకాశం ఉంటుంది.

వారికి ప్రేక్షకులు ఓటింగ్‌ వేయక పోవచ్చు.అందుకే బిగ్‌బాస్‌లో విన్నర్‌ ఎవరు అనేది ఇప్పటికప్పుడు చెప్పలేం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube