బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచే సత్తా ఆమెకే ఉందట, కిరీటి జోష్యం     2018-07-03   21:41:20  IST  Raghu V

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 మెల్ల మెల్లగా ఆసక్తికరంగా మారుతోంది. మొదటి మూడు వారాల పాటు సాదాసీదాగా సాగుతూ వచ్చిన షోకు మరింత మసాలా జోడిస్తూ ముందుకు తీసుకు వెళ్తున్నారు. బిగ్‌బాస్‌కు ప్రేక్షకులు మెల్లగా అలవాటు పడిపోతున్నారు. ఇక నాని కూడా హోస్టింగ్‌తో మెప్పిస్తున్నాడు. మొదటి వారంతో పోల్చితే తాజాగా జరిగిన ఎపిసోడ్స్‌లో నాని హోస్టింగ్‌ చాలా మెచ్యూర్డ్‌గా అనిపించింది. భారీ అంచనాల నడుమ ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో ఇప్పటి వరకు ముగ్గురు ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే.

మొదటి రెండు వారాలు సామాన్యులు ఎలిమినేట్‌ అవ్వగా, మూడవ వారంలో కిరీటి ఎలిమినేట్‌ అవ్వడం జరిగింది. ఇక ఈ వారం గణేష్‌ ఎలిమినేట్‌ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. గత వారం ఇంటి నుండి బయటకు వచ్చేసిన కిరీటి పలు టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆ సందర్బంగా కిరీటి మాట్లాడుతూ బిగ్‌బాస్‌ ఇంటికి సంబంధించిన పలు విషయాలను బయట పెడతున్నాడు. ఎప్పటిలాగే, అందరిలాగే ఇంటి సభ్యులు మంచి వారు, ఇంట్లో చిన్న చిన్న ఇష్యూలు జరగడం కామన్‌, అయితే వాటిని అప్పటికప్పుడు మర్చిపోతామని, అయితే ప్రేక్షకులు టీవీలో చూసినదానికి అక్కడ ఉండేదానికి తేడా ఉంటుందని చెప్పుకొచ్చాడు.