ఆ విషయంలో కేరళని ఫాలో అవుతున్న ఇతర రాష్ట్రాలు

దేశంలోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కేరళ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.అక్కడ పరిపాలించేది కమ్యూనిస్టు పార్టీ అయినా కూడా ప్రజా సంక్షేమం, సంస్కరణల విషయంలో సరికొత్తగా ఆలోచిస్తూ ప్రజలకు ఏం కావాలో అది కేరళ ప్రభుత్వం చేపడుతుంది.

 Kerala Water Bell Reaches All Over India-TeluguStop.com

కేరళ ప్రభుత్వం అవలంబించే విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా ఈ మధ్యకాలంలో బాగా ఫాలో అవుతున్నాయి.తాజాగా ఆ కోవలోకే వాటర్ బెల్ కాన్సెప్ట్ కూడా వచ్చింది.స్కూల్ వయసున్న విద్యార్థులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా అనారోగ్యాల బారిన పడటం, రెసిస్టెన్స్ పవర్ లేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు కూడా మంచం పట్టడం జరుగుతుంది.

5 నుంచి 15 సంవత్సరాల వయసున్న పిల్లలు ఎక్కువ మంచినీరు తీసుకోకపోవడమే అని శాస్త్రీయంగా రుజువు కావడంతో కేరళ ప్రభుత్వం వాటర్ బెల్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది.ముఖ్యంగా అమ్మాయిలలో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ కారణం నీరు తాగడమే అని నిర్ధారించుకున్న ప్రభుత్వం విద్యార్థులు రోజుకి రెండుసార్లు కచ్చితంగా నీళ్లు తాగే విధంగా వాటర్ బెల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఇప్పుడు దీనిని ఆంధ్రప్రదేశ్ తో పాటు గోవా వంటి ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి.

పిల్లల్లో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు రెసిస్టెన్స్ పవర్ పెంచే క్రమంలో ఈ వాటర్ బెల్ కార్యక్రమం విజయవంతంగా పనిచేస్తుందని వైద్యులు కూడా భావించడంతో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేయడానికి రెడీ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube