ఆ గ్రామంలో లాక్ డౌన్ పాటిస్తే ఫ్రిడ్జ్, బంగారం గెలుచుకోవచ్చు.. ఎక్కడో తెలుసా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని నియంత్రించేందుకు దేశంలో లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే.ఇంకా అలాంటి లాక్ డౌన్ గత 30 రోజులుగా కొనసాగుతున్నప్పటికీ ఎంతోమంది సరిగ్గా పాటించడం లేదు.

 Corona Virus, Lock Down, Kerala, Tajakode, Village Panchayat, Gifts, Lucky Draw-TeluguStop.com

ఎలాగోలా బయటకు వస్తున్నారు.కరోనా బారిన పడుతున్నారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ గ్రామం సరికొత్త ఆలోచన చేసింది.ఆ ఆలోచన చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే.

అలాంటి సరికొత్త ఆలోచన అది.అసలు ఏం ఆలోచన అంటే? లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉంటె అదిరిపోయే గిఫ్ట్ లు మీ సొంత నాయి ఆ గ్రామంలో దండోరా వేశారు.ఆ గిఫ్ట్ ఏంటి అంటే? బంగారం, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్‌‌లు.ఇది కేరళలోని మలప్పురం జిల్లా తాజేక్కొడే గ్రామ పంచాయతీలో ఈ గిఫ్టుల పతకాన్ని ప్రవేశపెట్టారు.ఎవరైతే లాక్ డౌన్ నియమాలు పాటిస్తారో.ఎవరైతే ఇంట్లోనే ఉంటారో వారికీ ఫస్ట్ ప్రైజ్ గా బంగారం, సెకండ్ ప్రైజ్ గా ఫ్రిజ్, థర్డ్ ప్రైజ్ గా వాషింగ్ మెషీన్ ను అందిస్తాం అని తెలిపారు.

లాక్‌డౌన్ పూర్తికాగానే తాము రూపొందించిన జాబితాలో ఉన్న గ్రామస్థులకు ఈ బహుమతులు అందిస్తాం అని ప్రకటించారు.దీంతో ఆ గ్రామస్థులు అంత ఇళ్లకే పరిమితం అయ్యారు.కాగా ఆ గ్రామా పంచాయతీ అధ్యక్షుడు ఏకే నజర్ మాట్లాడుతూ ఇలా అన్నారు.” ఈ గ్రామంలో పదివేల కుటుంబాలు నివసిస్తున్నాయి.మొత్తం కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ మా వద్ద ఉన్నాయి.ఆ ఇళ్ల నుంచి ఒక్క వ్యక్తి బయటకు వచ్చినా.వెంటనే వారిని ఈ పోటీ నుంచి తొలగిస్తాం.

ప్రస్తుతం మే 3 వరకు ఈ పోటీ నిర్వహించాలని అనుకుంటున్నాం.

లాక్‌డౌన్ తర్వాత ప్రజలు తాము నిబంధనలు ఖచ్చితంగా పాటించామని రాసి ఇవ్వాలి.అందరి వివరాలను పరిశీలించిన తర్వాత చివర్లో లక్కీ డ్రా తీసి బహుమతులు అందిస్తాం’’ అని తెలిపారు.

దీంతో గ్రామస్థులు అంత ఈ ప్రైజ్ మనీ కోసం ఇంట్లోనే ఉంటున్నారు.ఇంకా ఈ సరికొత్త ఐడియా సూపర్ అని అంటున్నారు నెటిజన్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube