భారత్ నుంచి తొలి అంతరిక్ష యాత్రికుడు.. కేరళవాసి అరుదైన ఘనత..!!

వేల ఏళ్లుగా మనిషి ఊహకు అందనది ఖగోళం.అంతరిక్షంలోని గుట్టును విప్పేందుకు అనాది కాలంగా మానవుడు ప్రయత్నిస్తూనే వున్నాడు.

 Kerala Travelogue Maker Becomes India's First Space Tourist All Set To Take The-TeluguStop.com

భూమి మీద విలసిల్లిన ప్రఖ్యాత నాగరికతలకు చెందిన వారు ఖగోళాన్ని అధ్యయనం చేశారు.మనదేశం విషయానికి వస్తే ఆర్యభట్ట, వరాహిమిహిరుడు వంటి శాస్త్రవేత్తలు ఎన్నో గ్రంథాలను రచించారు.

ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్నాడు.చంద్రుడి మీద కాలు పెట్టాడు.

అంగారకుడి మీద నివాస యోగ్యమైన ప్రాంతాల కోసం అన్వేషణ జరుపుతున్నాడు.చిన్నప్పుడు అమ్మ గురుముద్దలు తినిపిస్తూ చందమామను చూపించేది, అలాగే వేసవిలో ఆరుబయట మంచాలు వేసుకుని చుక్కల్ని లెక్కపెడుతూ.

స్పేస్‌లో ఏముంటదబ్బా, మనం కూడా రోదసీలోకి వెళితే బాగుండు అని అనుకోని వారుండరు.

కానీ, ఇప్పటి వరకు అంతరిక్షంలోకి వ్యోమగోములు, ఇతర వ్యోమనౌకలు తప్ప సాధారణ మనుషులు వెళ్లింది లేదు.

ప్రపంచంలోని ఎంతో మందికి ఖగోళంలో ఏముందో తెలుసుకోవాలని, అక్కడికి వెళ్లాలని ఆశ.కానీ నిన్న మొన్నటి వరకు కూడా అది అసాధ్యం.ఎందుకంటే రోదసీలోకి వెళ్లేందుకు సామాన్యులకు అనుమతి లేదు.ఇలాంటి వారి కలను నిజం చేసే అంతరిక్ష పర్యాటకానికి మార్గం సుగమం చేసేందుకు కొన్ని సంస్థలు దశాబ్ధాలుగా కృషి చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే అమెరికా బిలియనీర్ రిచర్డ్ బ్రాన్‌సన్‌కు చెందిన వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష చరిత్రలో కొత్త శకానికి నాంది పలికిన సంగతి తెలిసిందే.తెలుగమ్మాయి శిరీష బండ్లతో సహా పలువురితో కలిసి బ్రాన్‌సన్ చేసిన రోదసీ యాత్ర విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా వున్న పలువురు అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

దీనిలో భాగంగా పలువురు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా వర్జిన్ గెలాక్టిక్‌లో టికెట్లు కొన్నారు.

Telugu Sancharam, Santoshgeorge, Science, Sirisha Bandla, Virgin Galactic-Telugu

వివరాల్లోకి వెళితే.కేరళకు సంతోష్‌ జార్జ్‌ కులంగర అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు.ఇందుకోసం 2.5 లక్షల డాలర్ల ( భారత కరెన్సీలో రూ.1.8 కోట్లు)ను సంతోష్ ఖర్చు పెట్టనున్నారు.తద్వారా టికెట్‌ కొని రోదసియాత్ర చేపట్టిన తొలి భారతీయ పర్యాటకుడిగా ఆయన రికార్డుల్లోకెక్కనున్నారు.తనతో పాటు ఓ కెమెరానూ కూడా అంతరిక్ష యాత్రకు తీసుకెళ్లనున్నట్లు సంతోష్‌ వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మళయాలీల తరపున ఈ యాత్రను చేపడుతున్నానని ఆయన చెప్పారు. ‘సంచారం’ పేరుతో యూట్యూబ్‌లో యాత్రా విశేషాలను వివరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంతోష్‌ .ఇప్పటివరకు 1800 ఎపిసోడ్లను ప్రసారం చేశారు.అలాగే 24 ఏళ్ల కాలంలో ప్రపంచంలోని 130కి పైగా దేశాలను చుట్టేశారు.2007 నుంచి అంతరిక్ష యాత్ర కోసం తహతహలాడుతున్న సంతోష్.ఇందుకోసం శిక్షణ కూడా కంప్లీట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube