కేరళలో వరద బీభత్సం.. ఇల్లు ఎలా కొట్టుకుపోయిందో చూడండి!

ఇటీవల వర్షాలు భారీగా పడుతున్నాయి.భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి.

 Kerala Rains: House Washes Away In Kottayam Amid Torrential Downpour, Prayers Fo-TeluguStop.com

మన దేశంలో కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీని వల్ల కొన్ని లోటత్తు ప్రాంతాల్లో వరదలు రావడంతో ప్రజలు ఈ వర్షాలు, వరదల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ వరదల కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

ప్రెసెంట్ కేరళలో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారి పోయింది.

వర్షాలు, వరదలతో పాటు కొండ చర్యలు కూడా విరిగి పడుతుండడం తో కేరళ మొత్తం నానా బీభత్సంగా ఉంది.ముఖ్యంగా కేరళ లోని కొట్టాయంఇడుక్కి జిల్లాల్లో వరదల వల్ల కొద చరియలు ఇరిగి పడుతూ ఇల్లు కూడా ధ్వంసం అవుతున్నాయి.

ఇక ఈ వరదల కారణంగా కేరళలో ఏకంగా ఒక ఇల్లు వరదల్లో కొట్టుకు పోయింది.

కొట్టాయం జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉదృతి ఎక్కువుగా ఉండడం వల్ల ఆదివారం సాయంత్రం ఒక ఇల్లు ఆ వరదల్లో అమాంతం కొట్టుకు పోయిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.ముందకాయం ప్రాంతంలోని మణిమాల నదికి భారీ వర్షాలు కారణంగా వరద ఉదృతి పెరిగింది.ఆ నదికి భారీగా వరద నీరు చేరడంతో నది ఒడ్డున ఉన్న ఇల్లు ఆ వరద ఉధృతికి కొట్టుకు పోయింది.

అందరు చూస్తుండగానే ఆ ఇల్లు ఒక్కసారిగా కొట్టుకు పోవడంతో ఆశ్చర్య పోయారు.అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.ఇలా వరద ఉదృతి ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు ప్రజలను ముందుగానే కాళీ చేయడంతో ప్రాణ నష్టం తప్పింది.ఈ ఇల్లు కొట్టుకు పోతున్న వీడియో ప్రెసెంట్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

l

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube