అల్లు అర్జున్ క్రేజ్ ను అలా వాడుకున్న కేరళ పోలీసులు..?

గంగోత్రి సినిమాతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టి అల్లు అర్జున్ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీలో నటిస్తుండగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Kerala Police Using Allu Arjun Racegurram Police Getup Video For Pol App, Allu A-TeluguStop.com

అయితే అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు కేరళలో కూడా భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ నటించిన సినిమాలు తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

అయితే ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ ను కేరళ పోలీసులు వాడుకుంటున్నారు.సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన రేసుగుర్రం సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అల్లు అర్జున్ కొన్ని నిమిషాల పాటు పోలీస్ గెటప్ లో నటించారు.

సినిమాలో అల్లు అర్జున్ కుటుంబం ప్రమాదంలో చిక్కుకున్న సమయంలో అల్లు అర్జున్ పోలీస్ గా ఎంట్రీ ఇచ్చి విలన్ లకు ఝలక్ ఇస్తాడు.అల్లు అర్జున్ పోలీస్ గా కనిపించడం వల్లే ఈ సినిమా హిట్ అయిందని చాలామంది ఫ్యాన్స్ భావిస్తారు.అయితే ఆ వీడియోలో అల్లు అర్జున్ కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకుంటాడో ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే పోల్ యాప్ ద్వారా అలాగే రక్షించుకోవచ్చని కేరళ పోలీసులు చెబుతుండటం గమనార్హం.

కేరళ పోలీసులు నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుంటామని వీడియో ద్వారా కేరళ ప్రజలకు తెలిపారు.కేరళ పోలీసులు ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియోకు భారీ సంఖ్యలో లైక్ లు, రీ ట్వీట్లు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube