మిడిల్ ఈస్ట్ దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ నడపండి .. కేంద్ర పౌర విమానయాన శాఖకు కేరళ ప్రతిపక్షనేత లేఖ

తమ రాష్ట్రం నుంచి మధ్యప్రాచ్య దేశాలు (మిడిల్ ఈస్ట్)కు నేరుగా విమాన సర్వీసులను నడపాలని కేంద్రాన్ని కోరారు కేరళ ప్రతిపక్షనేత వీడీ సతీశన్( VD Satishan ).ఈ మేరకు ఆదివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు( Jyotiraditya Scindia ) ఆయన లేఖ రాశారు.

 Kerala Opposition Leader Vd Satheesan Wrote A Letter To Jyotiraditya Scindia For-TeluguStop.com

కేరళ నుంచి మిడిల్ ఈస్ట్ సహా ఇతర దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ నడపాలని సతీశన్ కోరారు.అలాగే ఫెస్టివల్ సీజన్‌లో విమాన టికెట్ ధరల పెంపును అరికట్టాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని త్రివేండ్రం, కొచ్చి, కోజికోడ్, కన్నూర్( Trivandrum, Kochi, Kozhikode, Kannur ) విమానాశ్రయాల నుంచి మధ్యప్రాచ్య దేశాలు, ఇతర దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ నడపాలని సతీశన్ కోరారు.కేరళలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలకు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం వల్ల విదేశాల్లో పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐలు( NRIs ) ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సతీశన్ ఆవేదన వ్యక్తం చేశారు.

వారు స్వదేశానికి రావాలంటే కనెక్టింగ్ ఫ్లైట్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోందని.దీని వల్ల ఎన్నో వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి తీసుకెళ్లారు.

Telugu Kannur, Kochi, Kozhikode, Middle, Trivandrum, Arab Emirates, Vd Satishan-

అలాగే పండుగల సీజన్‌లో టికెట్ రేట్ల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయని పలువురు ఎన్ఆర్ఐలు తన దృష్టికి తీసుకొచ్చారని.ఈ విషయంలోనూ చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.ఓనం, క్రిస్మస్, రంజాన్, పొంగల్ వంటి పండుగల సమయంలో మధ్యప్రాచ్యం, ఇతర దేశాల్లోని ప్రవాసులు కేరళకు ఎక్కువగా వస్తారని సతీశన్ చెప్పారు .ఈ సమయంలో ఛార్జీలు రూ.లక్ష వరకు పెరుగుతున్నాయని , ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Telugu Kannur, Kochi, Kozhikode, Middle, Trivandrum, Arab Emirates, Vd Satishan-

ఇకపోతే.ఇటీవల ఒడిషా నుంచి యునైటెడ్ అరబ్ ఎయిరేట్స్‌( United Arab Emirates ) (యూఏఈ)కి డైరెక్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఒడిషా రాజధాని భువనేశ్వర్ నుంచి దుబాయ్‌కి తొలి విమానం ప్రారంభమైన సందర్భంగా దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్, ఒడిషా ప్రభుత్వాలు ‘‘ ఒడిషా దివస్’’ పేరుతో వేడుకలు సైతం నిర్వహించారు.

ఇండిగో సంస్థ ప్రారంభించిన ఈ డైరెక్ట్ ఫ్లైట్ వల్ల యూఏఈలో నివసిస్తున్న దాదాపు 10 వేల మంది ఒడిషా ప్రవాసుల ప్రయాణ కష్టాలకు ముగింపు పలికినట్లయ్యింది.వీరంతా గతంలో భారత్‌లోని మిగిలిన నగరాల నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా యూఏఈకి చేరుకోవాల్సి రావడంతో అనేక వ్యయ, ప్రయాసలను ఎదుర్కొనేవారు.

ఈ నేపథ్యంలో ఒడిషా ఎన్ఆర్ఐలు గట్టి లాబీయింగ్ ద్వారా భువనేశ్వర్ నుంచి దుబాయ్‌కి తొలి అంతర్జాతీయ విమానాన్ని సాధించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube