స్ఫూర్తి: పరాయి దేశంలో బానిస బతుకు వద్దని.. రైతుగా రాణిస్తున్న ఎన్ఆర్ఐ

దేశం కానీ దేశంలో బానిసలా బ్రతికేకంటే సొంత దేశంలో అయినవాళ్ల మధ్య రైతుగా బతకాలని భారతదేశానికి తిరిగొచ్చి అపూర్వమైన విజయాలు సాధించాడు కేరళకు చెందిన ఓ వ్యక్తి.మధ్యప్రాచ్యంలోని పదేళ్లపాటు పనిచేసిన తర్వాత జాయ్ వాకాయిల్, అతని భార్య 2004లో కేరళ రాష్ట్రం కొట్టాయంలోని వారి స్వగ్రామానికి తిరిగి వచ్చారు.

 Inspirational Story,kerala Nri,  Rubber Plantation,organic Farm, Exports Veggies-TeluguStop.com

ఈ దంపతులకు నవీన్ జాయ్ అనే కుమారుడు జన్మించాడు.

లక్షలాది రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ భారతదేశం ఎందుకు తిరిగి వచ్చారని ఆయనను అడగ్గా.

జాయ్ తన సొంత పొలంలో వివిధ కూరగాయలు, పండ్లు పండించడానికి వచ్చానని చెప్పడంతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు.రైతు బిడ్డ కావడం, చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనులు చూస్తూ పెరిగిన జాయ్ తన మూలాలను వెతుక్కుంటూ తిరిగి వచ్చాడు.

కేరళకు వచ్చిన సమయంలో అతనికి చెందిన పొలంలో రబ్బరు తోట ఉంది.అయితే వాణిజ్య పంటలు ఒక్కటే కాకుండా వివిధ రకాల పంటలను పండించాలని జాయ్ నిర్ణయించుకున్నాడు.

దీనిలో భాగంగా రబ్బరుతో పాటు పైనాపిల్ వంటి పండ్ల తోటతో పాటు బెండకాయ, అరటి ఇతర కూరగాయాలను పండిస్తున్నాడు.అతని శ్రమకు ఫలితంగా ఇవాళ్టి రోజున ఆయన పొలం, మేకలు, అవులు, చేపలతో పాటు పండ్లు, కూరగాయ తోటలతో కళకళలాడుతోంది.

సేంద్రీయ విధానాలతో పండించిన పంటను యూరప్‌కు ఎగుమతి చేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.తాను మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని.

తాను చెప్పిన పనులను చుట్టూ ఉన్న వారు నమ్మలేదని దీనికి అదనంగా ఇంకొందరైతే రబ్బరును కత్తిరించి విక్రయించాలని సూచించారని జాయ్ చెప్పుకొచ్చాడు.అయితే రిస్క్ తీసుకోవడం వల్లే తాను ఊహించిన స్థాయికి వ్యవసాయం విస్తరించిందని అతను అన్నాడు.

కాగా పొలంలో పెట్టుబడులు పెట్టడానికి తాను నిజంగా పోరాటమే చేశానని జాయ్ చెప్పాడు.గల్ఫ్‌లో ఉండగా సంపాదించినప్పుడు పొదుపు చేసిన రూ.2 లక్షలు, కిసాన్ క్రెడిట్ కార్డు సహాయంతో మరో రూ.3 లక్షలు రుణంగా తీసుకున్నాడు.ఈ మొత్తాన్ని వ్యవసాయానికి అవసరమైన భూమి, ఇతర సామాగ్రిని సేకరించడానికి ఉపయోగించాడు.14 ఎకరాల అతని పొలంలో దాదాపు 5 ఎకరాల్లో బెండకాయ, మిర్చి, ఇతర కూరగాయ పంటలు.2 ఎకరాల్లో వరి, 4 ఎకరాల్లో కొబ్బరి చెట్లు, దుంప పంటలు వేయగా మిగిలిన భూమిని ఆవులు, మేకలు కోసం వదిలేశాడు.అతని ఘనతను నలుగురు గుర్తించడం మొదలుపెట్టడంతో మీడియా, ప్రజలు జాయ్ పొలాన్ని సందర్శించారు.

Telugu Europe, Kerala Nri, Organic Farm, Rubber-

అతని పంట పొలాలను వీడియోలో చూసిన కేరళలోని ఒక ఎగుమతి సంస్థ జాయ్‌ను సంప్రదించి, సేంద్రియ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే అంశంపై చర్చలు జరిపారు.ఈ ప్రతిపాదనకు జాయ్ అంగీకరించడంతో కూరగాయలను శాంపిల్ చేసి అనంతరం పంటను తీసుకునే పనులను ప్రారంభించనున్నారు.తాను గత ఆరు సంవత్సరాలుగా కూరగాయలను యూరప్‌కు ఎగుమతి చేస్తున్నానని జాయ్ చెప్పాడు.కొన్ని నెలలైతే పండిన పంటలో దాదాపు 3/4 వ భాగాన్ని ఎగుమతి చేస్తున్నట్లు తెలిపాడు.

ప్రధానంగా పసుపు, అల్లం, టాపియోకాకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ అధికంగా ఉందని, ఎందుకంటే ఇది విదేశాలలో సాగు చేయడం కష్టం అన్నాడు.

పొలం విస్తరించడం ప్రారంభించినప్పుడు, ఎరువులు, కంపోస్టు అవసరం కూడా పెరుగుతుంది.

అందువల్ల పశువైద్యుడు అయిన తన మిత్రుడు డాక్టర్ కురియాకోస్ మాథ్యూస్ పాడి వ్యవసాయం ప్రారంభించాల్సిందిగా తనకు సలహా ఇచ్చాడని జాయ్ పేర్కొన్నాడు.అలా ఈ రోజున తన పొలంలో దాదాపు 25 మేకలు, 10 ఆవులు ఉన్నాయని.

అవి ప్రతిరోజూ సగటున 90 లీటర్ల పాలను అందిస్తున్నాయని ఆయన చెప్పాడు.జంతువుల విసర్జకాల నుంచి వచ్చే ఎరువులన్నింటినీ వ్యవసాయ అవసరాలకు ఉపయోగిస్తున్నామని చెప్పాడు.

ఆకులు, మొక్కలను ఆవులకు, మేకలకు పశుగ్రాసంగా అందిస్తున్నట్లు జాయ్ చెప్పాడు.రైతుగా మారతానంటే తనను ఎందరో ఎగతాళి చేశారని కానీ ఇప్పుడు రైతుగా సాధించిన విజయాలు చూసి గర్వంగా ఉందని జాయ్ తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube