కేరళలో విషాదం: సెల్ఫ్ క్వారంటైన్‌లో గుండెపోటు.. ఎన్ఆర్ఐ మృతి

కరోనా

కట్టడి నేపథ్యంలో

భారత ప్రభుత్వం

కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ఎవరొచ్చినా సరే 14 రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉండాలి.

 Kerala Nri Home Quarantine Heart Attack Coronavirus-TeluguStop.com

లేదా ఇంట్లోనే తనకు తాను స్వీయ నిర్బంధంలో ఉండాలి.కొందరు ప్రవాస భారతీయులు ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తుండగా.

కొందరు మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు

హోం క్వారంటైన్‌

లో ఉన్న ఓ ఎన్ఆర్ఐ గుండెపోటుతో మరణించారు.

కేరళకు చెందిన 65 ఏళ్ల ప్రవాస భారతీయుడు షార్జా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటూ ఆదివారం గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు.ఆరోగ్య శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.

ఆయన కన్నూరు జిల్లా కన్నరిపరంబాకు చెందిన అబ్దుల్ ఖాదర్ మార్చి 21న షార్జా నుంచి భారతదేశానికి తిరిగొచ్చారు.ఆ తర్వాత ఆయనను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంచారు.

ఆయనకు కరోనా వైరస్ లక్షణాలు లేవని, అయితే విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తిరిగొచ్చే వ్యక్తులను ఐసోలేషన్‌లో ఉంచి వారిపై పోలీసులు, అధికారులు నిఘా పెడుతున్నారు.

Telugu Corona, Heart Attack, Kerala, Quarantine-

ఈ క్రమంలో ఆదివారం ఖాదర్ తన గదిలో అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి ఆసుపత్రికి తరలించారు.ఆయనను పరీక్షించిన వైద్యులు అబ్దుల్ ఖాదర్ అప్పటికే మరణించినట్లు ప్రకటించారు.గుండెపోటు కారణంగానే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారని, అంతకుమించి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఆయనకు లేవని మయ్యిల్ పోలీసులు తెలిపారు.

అయితే ఆయన నెవల్ కరోనా వైరస్ బారిన పడ్డాడో లేదో తెలసుకునేందుకు గాను ఖాదర్ రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు

కేరళ

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.ఖాదర్ మృతదేహాన్ని

కన్నూర్ మెడికల్ కళాశాల

లోని మార్చురీలో ఉంచారు.

ల్యాబ్ నుంచి వచ్చిన ఫలితం ఆధారంగా కరోనా లేకపోతేనే ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేస్తామని అధికారులు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube