10 మంది జీవితాలను మార్చేసిన లాటరీ.. 40 కోట్లు గెలుచుకున్నారు !

అతడు ఒక డ్రైవర్. బ్రతుకు దెరువు కోసం దుబాయ్ వరకు వెళ్ళాడు.తను కస్టపడి కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు.డ్రైవర్ గా చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న అతడికి సరిపడా డబ్బులు రావడం లేదు.కానీ అతడికి వచ్చే డబ్బులోనే లాటరీ కొనే అలవాటు ఉంది.ఎప్పుడు లాటరీ టికెట్ కొన్న అదృష్టం వరించలేదు.

 Kerala Man Working As Driver In Dubai Wins 40 Crore In Lottery, Man Wins Rs 40 C-TeluguStop.com

కానీ ఇన్ని రోజులకు అతడి కష్టాలకు దేవుడు కరుణించాడు.

అతడితో 10 మందికి కూడా అదృష్టం వరించడంతో వారి ఆనందానికి అవధులు లేవు.

వాళ్లకు లాటరీలో 40 కోట్లు వచ్చాయి.అసలు మ్యాటర్ లోకి వెళ్తే.

కేరళకు చెందిన రంజిత్ సోమరాజన్ 2008 నుండే దుబాయ్ లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.అతడికి ముందు నుండి లాటరీ కొనే అలవాటు ఉంది దీంతో ఆయనకు వచ్చే డబ్బులో కొంత భాగాన్ని లాటరీ కోసం ఖర్చు చేసే వాడు.

కానీ ఇంత వరకు ఒక్కసారి కూడా లాటరీ కలవలేదు.కానీ ఒక రోజు తన స్నేహితులు తొమ్మిది మందితో కలిసి రెండు లాటరీ టికెట్స్ కొన్నాడు.

Telugu Friends, Dubai, Dubai Lottery, Kerala, Keralawins, Winsrs-Latest News - T

లాటరీలో ఎంత వచ్చిన అందరు పంచుకోవాలని అనుకున్నారు.అనుకున్న విధంగానే లాటరీ వీరినే వరించింది.మన ఇండియన్ కరెన్సీలో సుమారు 40 కోట్ల రూపాయలు లాటరీలో గెలుచుకున్నారని తెలియడంతో వాళ్ళందరూ ఆనందానికి అవధులు లేవు.

Telugu Friends, Dubai, Dubai Lottery, Kerala, Keralawins, Winsrs-Latest News - T

కష్టకాలంలో లాటరీ తో వచ్చిన డబ్బు తమను ఆదుకుందని ఆ స్నేహితులు సంతోష పడుతున్నారు.వీరందరూ దుబాయ్ లో పని కోసం వెళ్లి అక్కడే డ్రైవర్స్ గా పని చేస్తున్నారు.వారందరు కలిసి ఆ లాటరీ డబ్బును సమానంగా పంచుకున్నారు.

ఒక్కొక్కరికి సుమారు 4 నుండి 5 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని రంజిత్ చెబుతున్నాడు.ఎన్నో రోజులుగా లాటరీ కొంటున్న మొత్తానికి ఇప్పుడు అదృష్టం వరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube