అదృష్టం అంటే ఈ భారతీయుడిదే..ఏమి లక్కు సామీ నీకు..!!!  

Kerala Man Won 24 Crore - Telugu 24 Crore , Abudhabi, Indian Man Luck, Kerala Man

అదృష్టం అనేది చెప్పి రాదు.దరిద్రం కూడా చెప్పి రాదు.

 Kerala Man Won 24 Crore Lottery

ఎప్పుడు ఏది ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు.ధనవంతుడు బిచ్చగాడు అవుతాడు.

బిచ్చగాడు అపర కోటీశ్వరుడు అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి.అందుకు అదృష్టం అనేది కీ రోల్ ప్లే చేస్తుంది.

అదృష్టం అంటే ఈ భారతీయుడిదే..ఏమి లక్కు సామీ నీకు..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఇంతకీ ఈ విషయాలు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి అబుదాబి పొట్ట కూటికోసం వెళ్ళాడు.

అక్కడి బేకరీలో మొన్నటి వరకూ రోజు కూలికి పని చేస్తూనే గడిపాడు.కానీ నేడు అతడే కోట్లకి అధిపతి అయ్యాడు.

ఎలా అనుకుంటున్నారా…

కేరళ రాష్ట్రానికి చెందిన అస్సేన్ అనే వ్యక్తి అబుదాబి కి 28 ఏళ్ళ క్రితమే వెళ్ళాడు.అక్కడ ఓ బేకరీ లో పనిచేస్తూ జీవనం సాగిస్తూ కేరళలో ఉన్న తన కుటుంభ సభ్యులకి కొంత డబ్బులు పంపుతూ కాలం వెళ్ళదీస్తున్నాడు.

ఈ క్రమంలోనే అతడు తన అదృష్టాని పరీక్షించుకోవడానికి అప్పుడప్పుడు లాటరీ టిక్కట్లు కొనుగోలు చేసేవాడు.సుమారు 4 సార్లు లాటరీ కొన్నా అదృష్టం తలుపు తట్టలేదు.

ఐదవ సారి లాటరీ కొన్నాడు.ఈలోగా కరోనా మహమ్మారి ప్రభలడంతో తన కేరళా రాష్ట్రానికి వెళ్ళిపోయాడు.

రెండు రోజుల క్రితం సదరు లాటరీ సంస్థ నుంచీ కాల్ వచ్చింది నువ్వు 24 కోట్లు గెలుచుకున్నావు అని.అది విని నవ్వుకుని స్నేహితులు ఆటపట్టిస్తున్నారు అనుకున్నాడు.వారు అతడు గెలుచుకున్న లాటరీ టిక్కెట్టు నెంబర్ చెప్పడంతో షాక్ అయ్యాడు.అప్పుడు గాని అర్థం కాలేదు.ఈ సారి లక్కు ఓ రేజ్ లో వచ్చిందని.రోజు వారి కూలిగా చేస్తున్న అతడు ఇప్పుడు 24 కోట్లకి అధిపతి అయ్యాడు.

తన దగ్గర ఉన్న డబ్బులో కొంత పేదలకోసం ఖర్చు చేస్తానని తెలిపాడు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kerala Man Won 24 Crore Lottery Related Telugu News,Photos/Pics,Images..

footer-test