పక్షుల దాహాన్ని తీర్చడం కోసం 15 లక్షలు ఖర్చు చేసిన నారాయణన్.. ఆయన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..

ఈ భూమి మీద మనతో పాటు ఇతర జీవాలకు కూడా బ్రతికే హక్కు ఉంది.కానీ మనం చెట్లను నరికిస్తే , చెరువులను పూడ్చేస్తూ ఇతర మూగ జీవాలకు గూడు లేకుండా చేస్తున్నాం.

 Kerala Man Narayanan Spent Rs 6 Lakh To Buy Clay Water Pots For Birds-TeluguStop.com

అవన్నీ పక్కన పెట్టిన వేసవి వచ్చిందంటే సూర్యుడి తాపనికి మనమే తట్టుకోలేకపోతున్నాం అలాంటిది పక్షులు ఎన్నో చనిపోతున్నాయి.చెరువులలో, కాలువలలో నీళ్లు ఎండిపోవడం తో వాటి దాహాన్ని తీర్చుకోలేకపోతున్నాయి.

పక్షుల దాహాన్ని మనం ఎలాగూ తీర్చలేము , కనీసం వాటికోసం ఇంటి పైన ప్రతి ఒక్కరు ఒక డబ్బా లో నీళ్ళని ఉంచితే కొన్ని పక్షులైనా వాటి దాహాన్ని తీర్చుకుంటాయి.పక్షుల గురించి మనం ఎలాగూ సమయాన్ని కేటాయించలేము అందరూ మాకెందుకులే అనుకుంటారు కానీ కేరళ ఎర్నాకుళం జిల్లాలోని ముత్తాడం గ్రామానికి చెందిన 70 ఏళ్ల శ్రీమాన్ నారాయణన్ మాత్రం నాకెందుకులే అనుకోలేదు.

వేసవిలో గుక్కెడు నీళ్ల కోసం మనమే ఎంతో అల్లాడుతున్నాం.అలాంటిది పక్షుల పరిస్థితి ఏమిటి అని ఆలోచించి, వాటికి అండగా నిలవాలని భావించారు.వాస్తవానికి పక్షులు చెరువులు లేదా నదుల్లో నీటిని తాగి తమ దాహాన్ని తీర్చుకుంటాయి.అయితే, వేసవిలో చెరువులు ఎండిపోతాయి.

ఇక ఎర్నాకుళం పరిధిలో ఉన్న పెరియార్ నది పూర్తి కాలుష్యంతో నిండిపోవడంతో ఆ నీటిని తాగిన పక్షులు చనిపోతున్నాయి.దీంతో వాటికి నీటిని అందుబాటులో ఉంచాలని నారాయణన్ నిర్ణయించుకున్నారు.ఇందుకోసం దాదాపు రూ.6 లక్షలు వెచ్చించి 10 వేల మట్టిపాత్రలు కొనుగోలు చేశారు.ఊళ్లోవారందరికీ వాటిని పంచిపెట్టి, తమ ఇంటి వద్ద పక్షుల కోసం నీటిని ఉంచాలని కోరారు.అలా వేసవిలో పక్షుల దాహార్తిని తీరుస్తూ వాటికి నారాయణుడిగా మారారు.

పక్షుల దాహాన్ని తీర్చడం కోసం 1

లాటరీ హోల్ సేల్ డీలర్ గా పనిచేస్తున్నారు.తద్వారా వచ్చే ఆదాయంలో అధిక భాగం పక్షుల కోసమే వినియోగిస్తున్నారు.‘‘నా ముగ్గురు పిల్లల పట్ల నా బాధ్యతను నెరవేర్చాను.ప్రస్తుతం వారు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు.ఇకపై నాకు వచ్చే ఆదాయాన్ని భవిష్యత్తు కోసం దాచాలని అనుకోలేదు.ప్రస్తుతం నాశనమైతున్న భూమిని వదిలేసి, భవిష్యత్తు కోసం సంపాదన దాయడంలో అర్థం లేదు.

లాటరీ వ్యాపారం, నాకున్న చిన్న రెస్టారెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పక్షుల కోసం వెచ్చిస్తున్నా’’ అని నారాయణన్ తెలిపారు.ఒక్క మట్టిపాత్రలో ఉంచిన నీళ్లు కనీసం 100 పక్షుల దాహాన్ని తీరుస్తాయని ఆయన వెల్లడించారు.

పక్షుల దాహాన్ని తీర్చడం కోసం 1

ప్రజలకు మట్టి పాత్రలు పంచే కార్యక్రమాన్ని గతేడాదే ఆయన ప్రారంభించారు.అది బాగా విజయవంతం కావడంతో ఈ ఏడాది కూడా 10వేల పాత్రలు కొనుగోలు చేసి ప్రజలకు పంచిపెట్టారు.అంతేకాకుండా రూ.15 లక్షల విలువైన 50వేల మొక్కలను ఎర్నాకుళం జిల్లా మొత్తం గతేడాది పంపిణీ చేశారు.ఆ మొక్కలు పెరిగి పళ్లు కాసిన తర్వాత వాటిలో కొన్నింటిని పక్షుల కోసం చెట్లపైనే ఉంచేయాలనే షరతుతో వాటిని జనాలకు పంచిపెట్టారు.ఆయన చేసిన మంచి పనులు గుర్తించిన ప్రభుత్వం ఆయనకి పలు అవార్డ్ లు ఇచ్చి సత్కరించింది.

ఈ రోజుల్లో కూడా పక్షుల కోసం ఆలోచించి పర్యావరణ రక్షణ కృషి చేస్తున్న నారాయణన్ గారు ఎంతో మందికి స్ఫూర్తి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube