కోవిడ్‌కు తలొగ్గని వైనం.. ఆరు నెలల తర్వాత రికవరీ, భారతీయ టెక్నీషియన్‌‌కు రూ.50 లక్షల రివార్డ్

గడిచిన రెండేళ్లుగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు.దీని కబంధ హస్తాలకు చిక్కి మహామహులే కన్నుమూశారు.

 Kerala Man In Uae Recovers From Covid After 180 Days , Tracheostomy, Bronchoscopy, Burjeel Hospital In Abu Dhabi, Arun Kumar Nair, Health Care Worker Of Indian Descent, Uae, Operation Theater Technician‌-TeluguStop.com

ఎంతో ఆరోగ్యంగా వుండే వారిని సైతం కోవిడ్ బలి తీసుకుంది.అలాంటిది వైరస్ బారినపడి దాదాపు 6 నెలల పాటు మృత్యువుతో పోరాడి గెలిచాడో భారత సంతతి హెల్త్ కేర్ వర్కర్.అతని ధైర్యానికి, పోరాట పటిమకు ఫిదా అయిన ఆసుపత్రి యాజమాన్యం రూ.50 లక్షల రివార్డును ఇచ్చి గౌరవించింది.

వివరాల్లోకి వెళితే.కేరళకు చెందిన అరుణ్ కుమార్ నాయర్(38) యూఏఈలోని అబుదాబికి చెందిన వీపీఎస్ హెల్త్‌కేర్‌లో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.కరోనా విపత్కర కాలంలో తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎంతో మందికి చికిత్స అందించాడు.ఆ క్రమంలో అరుణ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు.

 Kerala Man In UAE Recovers From Covid After 180 Days , Tracheostomy, Bronchoscopy, Burjeel Hospital In Abu Dhabi, Arun Kumar Nair, Health Care Worker Of Indian Descent, UAE, Operation Theater Technician‌-కోవిడ్‌కు తలొగ్గని వైనం.. ఆరు నెలల తర్వాత రికవరీ, భారతీయ టెక్నీషియన్‌‌కు రూ.50 లక్షల రివార్డ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైరస్ తీవ్ర ప్రభావం చూపడంతో కార్డియాక్ అరెస్టు, ఊపిరితిత్తులు పాడవ్వడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర ఆరోగ్య సమస్యలతో నరకయాతన అనుభవించాడు.ఇలా దాదాపు 6 నెలల పాటు కరోనాపై పోరాడాడు.

చివరికి వైరస్‌ను జయించి దాదాపు 180 రోజుల తర్వాత అరుణ్ కోలుకున్నాడు.గురువారం ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యాడు.అతని మొక్కవోని పోరాటానికి ఫిదా అయిన వీపీఎస్ హెల్త్‌కేర్ రూ.50లక్షల నగదు బహుమతిని అందించింది.అలాగే ఆయన భార్యకు ఉద్యోగం, పిల్లల చదువుకు అయ్యే ఖర్చులను కూడా భరిస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

చికిత్స సమయంలో అరుణ్ నాయర్.ట్రాకియోస్టోమీ, బ్రోంకోస్కోపీ వంటివి చేయించుకున్నారు.కోవిడ్ నుంచి కోలుకున్నందుకు గాను అబుదాబీలోని బుర్జీల్ హాస్పిటల్‌లో గురువారం వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అరుణ్ సహచరులు ఆయనకు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

తనకు ఏమి గుర్తు లేదని.మృత్యు కోరల నుంచి తప్పించుకున్నానని మాత్రమే తెలుసన్నారు.

తన కుటుంబం, సన్నిహితులు, ఇతరుల ప్రార్థనల బలం వల్లే ఈ రోజు బతికున్నానని అరుణ్ నాయర్ చెప్పాడు.ఆయన త్వరలో తల్లిదండ్రులను కలిసేందుకు భారత్‌కు వెళ్లనున్నారు.

వచ్చే నెలలో తిరిగి విధుల్లో చేరతానని అరుణ్ వెల్లడించారు.

Frontline Worker Recovery After Six Months

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube