భార్యని చంపడానికి పాములని తీసుకొచ్చిన ప్రభుద్దుడు

ప్రపంచ పురోగతి సాధించిన ఇండియాలో ఆడవాళ్ళపై అఘాయిత్యాలు, వరకట్న వేధింపులు, గృహహింస ఇప్పటికి ఎక్కడో ఒక చోట ప్రతి రోజు జరుగుతూనే ఉంది.ఇలాంటి వాటి బారిన పడిన అబలలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి చూస్తున్నాం.

 Kerala Man Held For Wifes Snakebite Murder, Dowry Harassment, Women Harassment,-TeluguStop.com

డబ్బు పిచ్చిలో పడి కొట్టుకుంటున్న మగాళ్ళు ఇప్పటికి ఆడవాళ్ళని కట్నం తీసుకొచ్చే వాళ్ళుగా ట్రీట్ చేస్తున్నారు.అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు.

తాజాగా కేరళలో ఇలాంటి వరకట్న వేధింపులో దిగ్బ్రాంతి కరమైన ఘటన వెలుగు చూసింది.భార్యను అంతమొందించేందుకు ఓ భర్త ఆమెని చంపడానికి పాములని ఉపయోగించుకున్నాడు.

పాము కరిచి చనిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు.అయితే పోలీసుల తమదైన శైలిలో విచారిస్తే వాస్తవాలు బయటపెట్టాడు.

కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన సురేశ్, ఉత్తర భార్యభర్తలు.సురేశ్ ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.కొన్నాళ్లుగా సురేశ్ తన భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు.ప్రయోజనం లేకపోవడంతో భార్యను తెలివిగా చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

మార్చి నెలలో ఓ వ్యక్తికి 10 వేలు చెల్లించి రక్తపింజరి పామును తీసుకువచ్చి తమ బెడ్రూంలో వదిలాడు.ఆ పామును చూసి హడలిపోయిన ఉత్తర దాన్నుంచి తప్పించుకునే క్రమంలో కాటుకు గురైంది.

దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొంది క్షేమంగా బయటపడింది.అయితే, ఈసారి సురేశ్ నాగుపామును తెప్పించాడు.

పుట్టింట్లో ఉన్న ఉత్తర నిద్రపోతున్న గదిలో ఆ విషసర్పాన్ని వదిలాడు.ఆ పాము ఉత్తరను కాటేయడంతో ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.

అయితే ఈసారి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఉత్తర ప్రాణాలు విడిచింది.తన కుమార్తెను రెండు సార్లు పాము కరవడంపై అనుమానం వచ్చిన ఉత్తర తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె భర్త సురేశ్ ను, విచారించి వాస్తవాలు బయటకి తీశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube