పనస పండుతో బయటపడ్డ కరోనా  

Kerala Man Got Corona Positive After Jackfruit Fell On Him - Telugu Corona Positive, Corona Virus, Jackfruit, Weird News

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా జనం తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు.ఎప్పుడు, ఎక్కడ నుండి వైరస్ మహమ్మారి సోకుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

 Kerala Man Got Corona Positive After Jackfruit Fell On Him

కాగా ప్రజలకు ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్‌ను విధిస్తూ వస్తోంది.అయితే 4వ దశ లాక్‌డౌన్‌లో పెద్ద ఎత్తున సడలింపులు ఇవ్వడంతో ప్రజలు రోడ్లపైకి పెద్ద సంఖ్యలో వస్తుండటంతో, పాజిటివ్ కేసులు సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.

అయితే ఓ మనిషికి కరోనా సోకిన విషయం అతడితో పాటు కుటుంబ సభ్యులకు తెలిసిన విధానం మాత్రం చాలా వింతైన ఘటనగా మిగిలింది.కేరళలోని బేలూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ పనస పండు కోసం ఓ చెట్టు ఎక్కాడు.

పనస పండుతో బయటపడ్డ కరోనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అక్కడ ప్రమాదవశాత్తు ఓ పనస పండు అతడిపై పడటంతో అతడు ఒక్కసారిగా చెట్టుపై నుండి కింద పడ్డాడు.దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.కాగా అతడి కుటుంబ సభ్యులు అతడిని కసరగడ్ జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు.

కానీ అతడి పరిస్థితి విషమించడంతో పరియార్‌లోని కన్నూర్‌ ఆసుపత్రికి తరలించారు.

కాగా అతడికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు అతడికి సర్జరీ చేసేందుకు రెడీ అయ్యారు.ఈ క్రమంలోనే అతడికి కరోనా టెస్టు చేయగా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న వైద్యులు, అతడి కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు.కాగా వారితో పాటు అతడితో సన్నిహితంగా మెలిగిన మరో 18 మందిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు అక్కడి అధికారులు.

ఏదేమైనా పనస పండు పడటం వల్ల ఇంత అనర్థం జరగుతుందా అంటూ ఈ వార్త తెలుకున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test