దేవుడిగా మారిన కరోనా.. వైరస్ కి పూజలు పురస్కారాలు..?

ప్రస్తుతం భారత్ లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమందిని మృత్యుఒడిలోకి చేరుస్తుంది ఈ మహమ్మారి వైరస్.

 Corona Virus,daily Puja,kerala Man Covid 19-TeluguStop.com

దీంతో ఈ మహమ్మారి వైరస్ పేరెత్తితే చాలు జనాలు భయంతో ఊగిపోవడమే కాదు బండబూతులు కూడా తిడుతున్నారు.ప్రస్తుతం కేవలం భారత దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ మహమ్మారి వైరస్ పేరెత్తితే చాలు ఆగ్రహంతో ఊగిపోతూ నోటికొచ్చింది తిట్టిపోస్తున్నారు.

కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాడు.ఓవైపు అందరూ కరోనా ను తిడుతుంటే ఈ వ్యక్తి మాత్రం ఏకంగా కరోనా వైరస్ కి పూజలు పునస్కారాలు చేస్తున్నాడు.

 Corona Virus,daily Puja,Kerala Man Covid 19-దేవుడిగా మారిన కరోనా.. వైరస్ కి పూజలు పురస్కారాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఈ ఆసక్తికర ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది.కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది ఈ ఆశ్చర్యకర ఘటన.కేరళ రాష్ట్రంలోని కలక్కడ్ కు చెందిన అనిలన్ అనే వ్యక్తి కరోనా వైరస్ కు ఏకంగా దేవుడికి పూజలు చేసినట్లుగా… పూజలు చేస్తూ… కరోనా దేవి నమో నమః అంటూ వేడుకుంటున్నాడు.

ఇక ఈ వ్యక్తి పూజలు పునస్కారాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కేవలం ఫేమస్ అవ్వడానికి కరోనా ను వాడుకుంటున్నాడు అంటు కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

కానీ ఇతగాడు ఏం చెబుతున్నాడంటే… ఈ వైరస్ ను నిరోధించడానికి పని చేస్తున్నా వారు, వాక్సిన్ కనిపెట్టేందుకు శ్రమిస్తున్న వారు ఇలా ప్రతి ఒక్కరు బాగుండాలనే వైరస్ కు పూజలు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.ఇక తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోను అంటూ కొట్టిపారేశాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube