బాబోయ్.. అక్కడ కరోనాకు గుడి కట్టి పూజలు చేస్తున్నారు!?

కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎలా నాశనం చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Kerala Man, Coronavirus, Goddess, Shrine, Corona Temple, Bengal,coronavirus Godd-TeluguStop.com

రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.ఈ వైరస్ ని నాశనం చేసే వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రాత్రి పగులు తేడా లేకుండా కష్టపడుతుంటే మరి కొందరు మూఢనమ్మకాలతో కరోనా కు పూజలు చేస్తున్నారు.

మీకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ పట్టణంలో చిన్నమస్తా చెరువు ఒడ్డున వైరస్‌ను అమ్మవారిగా భావిస్తూ కరోనా మాయి పేరుతో చిన్న సైజు గుడిని కట్టేశారు.

అక్కడ కరోనాకు నిత్యం పూజలు చేస్తూ పండ్లు, పూలు సమర్పిస్తున్నారు.వైరస్ ను శాంతించాలి అంటూ ప్రార్ధనలు చేస్తున్నారు.

బెంగాల్ లో అలా ఉంటే కేరళలోని కడక్కల్ పట్టణంలో నివసిస్తున్న అనిలన్ ముహూర్తం అనే వ్యక్తి తన ఇంట్లోనే గుడి కట్టేశాడు.కాళిమాత మెడలో కరోనా నమూనాను వేలాడి దీసి నిత్యం పూజలు చేస్తున్నాడు.

గాలిలో దేవుడు ఉంటాడని నేను నమ్ముతాను.అందుకే కరోనా కు పూజిస్తున్న అంటూ అయన వ్యాఖ్యానించాడు.

ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ్.కాగా గతంలోను కొందరు మహిళలు ఇలా వైరస్ కు పూజలు చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube