అత్యాచార నిందితుడికి దేహశుద్ది చేసిన స్థానికులు, దిశ ఎఫెక్టా

దిశ అత్యాచారం,హత్య ఘటనలో నిందితులు ఆయిన ఆ నలుగురు ఇటీవల పోలీసుల ఎంకౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ ఒక్క ఘటన తో దేశ వ్యాప్తంగా అత్యాచార నిందితులను ఇలానే త్వరితంగా శిక్షించాలి లేదంటే ఇలా ఎంకౌంటర్ చేసేయాలి అంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.

 Kerala Man Acquitted In Rape Murder Case Trashed By Group-TeluguStop.com

ఈ నేపథ్యంలో కేరళ లో ఒక అత్యాచార నిందితుడి పై స్థానికులు దాడి కి పాల్పడ్డారు.కేరళ పాలక్కాడ్ జిల్లా వలయార్ లో రెండేళ్ల క్రితం ఇద్దరు అక్క చెల్లెల్లు పై అత్యాచారం,హత్య కు పాల్పడిన నిందితుడు తో వాగ్వివాదానికి దిగిన స్థానికులు అనంతరం చితకబాదినట్లు తెలుస్తుంది.

తీవ్రంగా గాయపడిన నిందితుడు మధు ను పోలీసులు పాలక్కాడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే మరోపక్క ఈ దాడికి సంబంధించి ఇప్పటికే ముగ్గురు ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

వలయార్‌లోని ఓ శిథిల నివాసంలో 2017లో రెండునెలల వ్యవధిలోనే 13 ఏండ్ల అక్క, తొమ్మిదేండ్ల చెల్లెలిపై సామూహిక లైంగికదాడి, హత్య జరిగింది.ఈ ఘటనలో మధు అనే వ్యక్తి కూడా నిందితుడి గా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో స్థానికులు,మధు ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడం తో స్థానికులు చితకబాదినట్లు తెలుస్తుంది.ఇటీవల హైదరాబాద్ లోని షాద్ నగర్ లో చోటుచేసుకున్న దిశ సంఘటన తో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

ఇలాంటి వారిని బ్రతక నివ్వకూడదు అని బహిరంగంగా ఉరి తీయాలని,లేదంటే ఎంకౌంటర్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడం తో గత శుక్రవారం సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం అని సంఘటనా స్థలానికి ఆ నలుగురు నిందితులను తీసుకువెళ్లగా పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపి తప్పించుకోవాలని చూడడం తో పోలీసులు ఎదురుకాల్పులు జరపడం తో ఆ నలుగురు నిందితులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ ఒక్క ఎంకౌంటర్ తో హైదరాబాద్ పోలీసుల పై ప్రసంశలు కురిపించడం తో పాటు పూల వర్షం కూడా కురిపిస్తున్నారు ప్రజలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube