ఒకప్పుడు వివాదానికి గురైన ఈ ఫోటోపై ఇటీవల కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందో తెలుసా.?

బిడ్డకు తల్లి పాలివ్వడం అనేది సర్వ సాధారణమైన విషయం.బిడ్డకు తల్లి పాలిస్తే దాంట్లో ఉండే అనేక పోషకాలు బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడతాయి.

 Kerala Mags Breastfeeding Model Has No Regrets After Hc Ruling-TeluguStop.com

ప్రపంచంలో ఏ ఆహారంలోనూ లేని పోషకాలు, ఔషధ గుణాలు తల్లి పాలలో ఉంటాయి కనుకనే వైద్యులు కూడా బిడ్డకు తల్లిపాలు తప్పనిసరి అని చెబుతారు.అయితే కొందరు మాత్రం దీన్ని నామోషీగా ఫీల్‌ అవుతారు.

బిడ్డకు పాలిస్తే తమ వక్షోజాలు సాగిపోతాయని, అందాన్ని కోల్పోతామని, సెక్స్‌ అప్పీల్‌ ఉండదని అనుకుంటారు.ఇక కొందరు బిడ్డకు బహిరంగంగా పాలివ్వడానికి సందేహిస్తారు.

దీంతో చాలా మంది పిల్లలకు పోషణ సరిగ్గా అందడం లేదు.అయితే జనాల్లో ఉన్న ఈ అపోహలను, మూఢ విశ్వాసాలను పోగొట్టేందుకు ఆ మ్యాగజైన్‌ ఓ వినూత్న ప్రయోగం చేసింది.ఇంతకీ అదేమిటంటే…

కేరళకు చెందిన ప్రముఖ మ్యాగజైన్‌ గృహలక్ష్మి మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లిపాలపై జనాల్లో ఉండే అపోహలను పోగొట్టేందుకు ఓ వినూత్న ప్రయోగం చేసింది.గిలు జోసెఫ్‌ అనే మోడల్‌తో ఫొటోషూట్‌ చేసింది.ఆమె తల్లి వేషంలో బిడ్డకు పాలు ఇస్తూ ఉంటుంది.అలా పాలు ఇచ్చేటప్పుడు తీసిన ఫొటోను గృహలక్ష్మి మ్యాగజైన్‌ తన కవర్‌ పేజీపై ప్రచురించింది.దీనికి సంబంధించిన పలు ఇతర ఫొటోలను, పలువురు మహిళలు తమ పిల్లలకు పాలిస్తున్న ఫొటోలను కూడా ఆ మ్యాగజైన్‌ తన ఇష్యూ లోపలి పేజీల్లో ప్రచురించింది.తల్లి పాలను ఇవ్వడం అనేది సర్వ సాధారణమైన విషయమని, అందుకు సందేహించాల్సిన పనిలేదని, ఎలాంటి అపోహలకు లోను కావల్సిన పనిలేదని, దాన్ని కాముక దృష్టితో చూడరాదని ఆ మ్యాగజైన్‌ కథనంలో రాసుకొచ్చింది.

బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు పాలిచ్చే తల్లులను ఆ దృష్టితో చూడకండని, అలాగే తల్లులు పైట కొంగు చాటున పాలివ్వాల్సిన పనిలేదని, అందులో దాచాల్సింది ఏమీ లేదని, బహిరంగంగానే పాలివ్వాలని కూడా తెలియజేసింది.

అయితే గృహలక్ష్మి తన మ్యాగజైన్‌లో ఇలా తల్లి బిడ్డకు పాలు ఇచ్చే ఫొటోలను ప్రచురించడం ఏమో గానీ ఈ విషయాన్ని అనేక మంది సమర్థిస్తున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు తల్లులకు ఎదురయ్యే సమస్యే ఇదని, అయితే ఇందుకు సిగ్గు పడాల్సిన పనిలేదని, అది చాలా సాధారణమైన విషయం అని, ఎదుటి వారిని కూడా అలాంటి స్త్రీల వైపు చూడవద్దని, కామ దృష్టితో చూడకండని అందరూ సపోర్ట్‌ నిస్తున్నారు.అయితే కొందరు మాత్రం సదరు మ్యాగజైన్‌ చేసిన పనిని వ్యతిరేకిస్తున్నారు.

మోడల్‌కు బదులుగా ఎవరైనా నిజంగా తల్లితోనే ఫొటోషూట్‌ చేసి ఉంటే బాగుండేదని, బహిరంగా పాలివ్వడం అనే విషయాన్ని ఇలా ప్రమోట్‌ చేయాల్సిన పనిలేదని అంటున్నారు.

అయితే దీనిపై సదరు మోడల్‌ గిలు జోసెఫ్ తో పాటు ఆ మ్యాగజైన్‌ ఎడిటర్‌ కూడా స్పందించారు.

బిడ్డలకు పాలివ్వడంలో అనేక మంది తల్లులకు ఉన్న అపోహలను తొలగించడం కోసమే తాము ఈ ప్రయత్నం చేశామని, తమకు సపోర్ట్‌ తెలుపుతున్న వారిని స్వాగతిస్తున్నామని అన్నారు.అయితే ఇది ఆ రాష్ట్రంలో కొత్త కాదు, గతంలోనూ అక్కడ అమృత అనే ఓ మహిళ ఇలాగే తాను తన బిడ్డకు పాలిస్తున్న సమయంలో ఫొటో తీసి దాన్ని ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయగా అది సంచలనం సృష్టించింది.

అప్పట్లో ఆమె చేసిన ఆ పనిని తీవ్రంగా విమర్శించారు.

రళకు చెందిన వినోద్‌ మాథ్యూ విల్సన్‌ మేగజీన్‌ నిర్వాహకులు, జోసెఫ్‌పై కేసు పెట్టారు.

పిటిషన్లను విచారించిన హైకోర్టు కవర్‌ ఫోటోలో అశ్లీలత ఏమీ లేదని పేర్కొంటూ కింద విధంగా తీర్పు వెలువరించింది.

దేశ వ్యాప్తంగా ప్రతియేడు తల్లిపాలు సరిపడా అందక దాదాపు లక్ష మంది శిశువులు డయేరియా, న్యూమోనియా బారినపడి చనిపోతున్నారు.

విదేశాల్లో మాదిరిగా మన దేశంలో పిల్లలకు పాలు ఇవ్వడానికి సదుపాయాలు లేవు.జన సమూహ ప్రదేశాల్లో, బహిరంగంగా చిన్నారుల ఆకలి తీర్చడానికి తల్లులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తల్లులకు అవగాహన కల్పించాలనే సదాశయంతో గృహలక్ష్మి మేగజీన్‌ తన మార్చి సంచిక కవర్‌ ఫోటోపై మోడల్‌ గిలు జోసెఫ్‌ బిడ్డకు చనుబాలు ఇస్తున్న చిత్రాన్ని ప్రచురించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube