కోహ్లీ, తమన్నాలకు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే?

టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీ తమన్నా.తనకున్న ఫాలోయింగ్ తన అందంతో పెంచుకుంటూ పోతుంది.

 Kerala High Court Issued Notice To Kohli And Tamannaah, Virat Kohli, Tamannaah,-TeluguStop.com

సినీ పరిశ్రమలో మిల్క్ బ్యూటీ గా పేరొందిన తమన్నా ఇప్పుడు ఇరుకులో పడింది.తనతో పాటు ఇంటర్నేషనల్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, మలయాళ నటుడు అజు వర్గీస్ లకు కేరళ హైకోర్టు నోటీసుల ను అందించింది.

ప్రస్తుతం ఆన్ లైన్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో.కేరళ హైకోర్టు సందేశాలు జారీ చేసింది.స్మార్ట్ ఫోన్ లో ఆన్ లైన్ గేమ్ ల వల్ల ఎన్నో నేరాలు జరుగుతూ దృష్టికి వస్తున్నాయి.ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఆన్ లైన్ గేమ్ లో డబ్బులు సంపాదించడానికి బెట్టింగ్ చేస్తూ ఎంతోమంది డబ్బులను కోల్పోయి ఆత్మహత్య లకు పాల్పడుతున్న సంగతి రోజు రోజుకు చోటుచేసుకుంటున్నాయి.అయితే ఆన్ లైన్ బెట్టింగ్ కు.ఈ స్టార్ లకు మధ్య సంబంధం ఏంటి అంటే.

Telugu Kerala, Kohli, Tamannaah, Virat Kohli-Movie

ఆన్ లైన్ రమ్మీ గేమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విరాట్ కోహ్లీ, తమన్నా, అజు వర్గీస్ లు నేరాలు జరుగుతున్న ఆన్ లైన్ గేమ్ లపై ప్రచారం చేస్తున్నందుకు హైకోర్టు వీళ్లకు నోటీసులు అందించింది.నేరాలకు పాల్పడుతున్న ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ వెబ్ సైట్లకు స్టార్స్ ప్రమోట్ చేయడం తప్పంటూ.స్టార్స్ ప్రచారాల వల్ల ఎంతోమంది ఆన్లైన్ గేమ్ లకు ఆసక్తి చూపుతుంటారు కాబట్టి వీటిని వెంటనే రద్దు చేయాలని త్రిసూర్ కు చెందిన వర్గీస్ కేరళ హైకోర్టులోతెలిపారు.

గతేడాది ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ను ప్రమోట్ చేస్తున్నందుకు కొందరు సెలబ్రిటీలను, క్రికెటర్లను మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ ఆన్ లైన్ గేమ్స్ ల ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందించాలని హైకోర్టు తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube