విదేశాల్లో చిక్కుకుపోయిన ఎన్ఆర్ఐల కోసం: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కేరళ

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.దీంతో విద్య, ఉపాధి, విహారయాత్రల కోసం వివిధ దేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు.

 Corona Virus, Lock Down, Kerala Government, Indian Embassy, Spain, Tamil Nadu, O-TeluguStop.com

అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయడంతో ఎయిర్‌పోర్టుల్లో, భారత రాయబార కార్యాలయాల్లో ఆశ్రయం పొందుతూ.స్వదేశానికి ఎప్పుడు వెళ్తామా అని ఎదురుచూస్తున్నారు.

అదే సమయంలో తమను కాపాడాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయుల ఇబ్బందులపై స్పందించిన కేరళ ప్రభుత్వం వారి కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ప్రారంభించింది.

మే 3 తర్వాత దేశంలో లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు కసరత్తు చేస్తున్న భారత ప్రభుత్వం.వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన మన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

దీనిలో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన పౌరుల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలను కోరింది.అలాగే వారిని భారత్‌కు తీసుకొచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చలు జరిపింది.ఇప్పటికే ఈ సమస్యపై పీఎంవో కార్యాలయ అధికారులు….ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు.

వారు స్వదేశానికి వచ్చిన వెంటనే ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Corona, Indian Embassy, Kerala, Lock, Pmo, Spain, Tamil Nadu-

దీనిలో భాగంగానే కేరళ మలయాళీల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది.విదేశాల్లో చిక్కుకుని, భారత్‌కు రావాలని భావిస్తున్న కేరళీయులు www.norkaroots.org.లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కేరళ ప్రభుత్వం సూచించింది.కాగా ఆదివారం రాష్ట్రంలో కొత్తగా 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.స్పెయిన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తితో పాటు, తమిళనాడు నుంచి వచ్చిన ఇద్దరికి వైరస్ సోకింది.

మరోవైపు భారతదేశంలోనూ లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో వివిధ రాష్ట్రాల్లో వున్న మలయాళీలు రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో వీరిని కూడా స్వ రాష్ట్రానికి రప్పించేందుకు పినరయి విజయన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.

ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube