దివ్యాంగుడు అని తెలిసికూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న కేరళ యువతి  

Kerala Girl Married Physical Handcaped Person In Temple - Telugu Kerala Girl, , Kerala Handcaped Marriage, Love Marriage, Pranav Video In Social Media, Taje Ghat Pranav

కేరళ కు చెందిన ఒక యువతి దివ్యంగుడు అయిన వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది.ప్రేమ కు ఎలాంటి పట్టింపులు ఉండవని,ప్రేమ కలిగితే వయసు గానీ,కులం,మతం,ఆస్తి, అందం ఏవీ కూడా పట్టింపు ఉండవని ఆ యువతి నిరూపించింది.

Kerala Girl Married Physical Handcaped Person In Temple

కేరళ త్రిచూర్ జిల్లా లోని తాజె ఘాట్ కు చెందిన ప్రణవ్ కి ఆరేళ్ల కిందట విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది.ఆ ప్రమాదంలో తుంటి కింద భాగం దెబ్బతిని నడవలేని పరిస్థితి వచ్చింది.

దీనితో చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు.ప్రతి దానికీ ఇతరుల సాయంపై ఆధారపడాల్సి వస్తోంది.

దివ్యాంగుడు అని తెలిసికూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న కేరళ యువతి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయినప్పటికీ నిరుత్సాహపడని ప్రణవ్ అక్కడి ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు వెళ్తూ కళ్లారా ఆ వేడుకలను చూసేవాడు.అతని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తో ఆ పరిస్థితుల్లో తిరువనంతపురానికి చెందిన షహానా ఓ రోజు అనుకోకుండా ప్రణవ్‌ వీడియోలు చూసింది.

అయితే అతని కాన్ఫిడెన్స్ నచ్చిన ఆ యువతి అతడికి ఫోన్ చేసి మాట్లాడింది.ఆ పరిచయం కాస్త ప్రేమ గా మారడం తో షహనా పెళ్లి చేసుకుందామా అంటూ ప్రణవ్ ని అడిగింది.

అయితే ప్రణవ్ మాత్రం ఆ పెళ్లి ప్రతిపాదనను ఒప్పుకోలేదు.నువ్వు చాలా మంచిదానివి.

నా పరిస్థితి వేరు.నా లాంటి వాణ్ని చేసుకొని… నువ్వు సుఖంగా ఉండలేవు.

ఇంకెవరినైనా చేసుకో… హాయిగా ఉండు అంటూ చెప్పడం తో దానికి షహానా ఒప్పుకోలేదు.

పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా… లేదంటే ఇలాగే ఉండిపోతా అని స్పష్టం చేసిన షహనా అసలు నేనంటే నీకు ఇష్టమా కాదా అని ప్రణవ్ ని ప్రశ్నించింది.దానికి ప్రణవ్ బదులు గా “నువ్వంటే ప్రాణం… బట్” అంటూ ఏదో చెప్పబోతుంటే ఇంకేం చెప్పొద్దు అంటూ మా పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పిస్తా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది.అనంతరం తల్లి దండ్రులతో విషయం చెప్పడం తో వారు షహనా పై ఫైర్ అయ్యారు.

అనంతరం ఎలానో తల్లిదండ్రులను ఒప్పించడం తో ఓ ఆలయంలో ఇటీవల ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకొని ఒక్కటైంది.ఆ తర్వాత కేరళలో ఇదో హాట్ టాపిక్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kerala Girl Married Physical Handcaped Person In Temple Related Telugu News,Photos/Pics,Images..

footer-test