మామిడి ఆకులతో ఇలా కూడా చేసి లక్షల్లో సంపాదించవచ్చు తెలుసా..?

మామిడి పండ్ల తినడానికి ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మామిడి పండ్ల కాలం ఎప్పుడు వస్తుందా అని అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.

 Kerala Farmers Earning Lakhs Of Rupees With Mango Leaves Details, Mango Leaves,-TeluguStop.com

రైతులు కూడా మామిడి పండ్ల కాలం గురించి ఎంతగానో ఎదురుచూస్తారు.ఎందుకంటే ఆ మామిడి పండ్లు అమ్ముకుంటే డబ్బులు వస్తాయనే ఆశతో ఎదురు చూపులు చూస్తారు.

మామిడి పండ్లు అమ్మితే డబ్బులు వస్తాయనే విషయం మన అందరికి తెలిసిందే.మరి అదే విధంగా మామిడి ఆకులు అమ్మినగాని డబ్బులు సంపాదించవచ్చని మీకు తెలుసా.

ఒక్క డబ్బే కాదండోయ్.మామిడి ఆకులు అమ్మితే ఒక కంపెనీలో షేర్లు కూడా పొందవచ్చు తెలుసా? వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నాగాని ఇది నిజం.

అసలు వివరాల్లోకి వెళితే.కేరళ రాష్ట్రంలో ఈ మామిడి ఆకుల వ్యాపారం జరుగుతుంది.అక్కడ ఎండు మామిడి ఆకులతో కేరళ రైతులు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు.మామిడి పండ్లు విషయానికి వస్తే మహా అయితే కిలో 200 నుంచి 500 రూపాయల వరకు ఉంటాయి కదా.అలాగే ఈ ఎండిన మామిడి ఆకుల ధర కూడా కేజీకి 150 వరకు పలుకుతుంది.కేరళలోని కన్నూర్​, కాసర్​గోడ్ ​లో రైతులంతా ఎండిన మామిడి ఆకులతో అదనపు ఆదాయం లభిస్తుంది.ఓ కంపెనీ ఇచ్చిన ఆఫర్​తో మామిడి ఆకుల వ్యాపారం మొదలైంది.‘ఈనో వెల్​నెస్​ నికా’ అనే పళ్లపొడి కంపెనీ ఈ ఎండు మామిడి ఆకులను కొనుగోలు చేస్తోంది.

Telugu Dried, Lakhs, Mango-Latest News - Telugu

ఆర్గానిక్ పళ్ల పొడికి ఇటీవలే పేటెంట్ హక్కులు పొందిన ఈ సంస్థ త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనుంది.అందుకోసం ఇప్పటినుంచే పళ్ళపొడికి అవసరమైన ముడి సరకు కొనుగోలుపై దృష్టిపెట్టింది.ఈ క్రమంలోనే కన్నూర్​, కాసర్​గోడ్​ లోని రైతుల దగ్గర నుండి ఎండిన మామిడి ఆకులు సేకరిస్తోంది.అయితే ఈ ఎండు మామిడి ఆకులు మంచి శుభ్రమైన వాతావరణంలో సహజసిద్ధంగా రాలినవయి ఉండాలి.

అంతేకాదు పూర్తిగా ఎండకు ఎండినవై ఉండాలి.అలా ఎండిన మామిడి ఆకులను ఆ కంపనీ వాళ్ళకి ఇస్తే ఒక్కో కిలోకు 150 రూపాయలు దాక ఇస్తారట.

ఒకవేళ వాళ్ళకి గాని డబ్బులు వద్దు అనుకుంటే ప్రతి రెండు కిలోలకు ఆ సంస్థలో ఒక షేరు కూడా వాళ్లకు కేటాయిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube