భారతదేశంలో పేద రైతులు మాత్రమే కాదు ధనిక రైతులు కూడా ఉంటారు.రైతుల్లో సంపన్నులైన వీరు లగ్జరీ కార్లలో తిరుగుతుంటారు.
అంతేకాదు వాటిని వ్యవసాయ పనుల్లో వాడుతూ ఆశ్చర్యపరుస్తుంటారు.కోట్ల రూపాయల ఖరీదైన కార్లను గడ్డి మోసుకుపోవడానికి ఉపయోగించి గతంలో కొందరు రైతులు( Farmers ) ఆశ్చర్యపరచిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో రైతు కూరగాయలు అమ్మేందుకు మార్కెట్లో ఆడి కారులో( Audi Car ) వెళ్ళాడు.బచ్చలికూర కట్టలను పూర్తిగా అమ్ముకున్న తర్వాత మళ్లీ అదే కారులో వెళ్లిపోయాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఒక కేరళ రైతు( Kerala Farmer ) రోడ్డు పక్కన ఉన్న మార్కెట్‌లో బచ్చలికూరను విక్రయించడానికి తన ఆడి A4 కారులో( Audi A4 ) వెళ్లడం గమనించవచ్చు.సుజిత్ ఎస్పీ( Sujith SP ) అనే ఈ రైతును ఇంటర్నెట్‌లో “వెరైటీ ఫార్మర్” అని సరదాగా పిలుస్తుంటారు.వీడియో ప్రకారం, ఈ రైతు బచ్చలి ఆకులను తోటలో కోసి ఆటో రిక్షాపై మార్కెట్‌కి తరలించాడు.
ఆటో వెనకే తన కారులో మార్కెట్‌కి ప్రయాణించాడు.
ఈ రైతు లుంగీ ధరించి చాలా సింపుల్‌గా కనిపించాడు.మార్కెట్‌కి రాగానే రోడ్డు పక్కన తెల్లటి చాపపై ఆకు కూర కట్టలు పెట్టాడు.వాటిని విక్రయించిన తరువాత, రైతు ప్రతిదీ మూటగట్టి తన ఆడి కారు వద్దకు నడుస్తాడు.
అతను కారు డోర్ తెరిచి, తన లుంగీని సరిచేసుకుని, కారులో కూర్చొని వెళ్లిపోతాడు.కోట్ల విడుదల కారులో వచ్చి చాలా సాధారణ వ్యక్తిలా కూరగాయలు అమ్ముకుంటున్నా ఈ రైతును చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
కొన్ని రోజుల క్రితం సుజిత్ ఈ వీడియోను పోస్ట్ చేయగా దానికి ఇప్పటికే 468,000 లైక్స్, 80 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.