తన యజమాని కోసం ప్రాణ త్యాగం చేసిన శునకం…!  

Kerala dog electrocuted to death while trying to save owner\'s life, Kerala Dog, Saved Owner\'s life, - Telugu Current, Died, Dog, Kerala, Owner, Power

అందరికీ తెలిసిన విధంగానే పెంపుడు జంతువులు వాటి యజమానుల పట్ల ఎంత ప్రేమ చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అందులో ముఖ్యంగా కుక్కలు మనిషి పట్ల ఎంత విశ్వాసాన్ని చూపుతాయో అందరికీ తెలిసిందే.

TeluguStop.com - Kerala Dog Electrocuted Death Saves Owner Life

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అవసరమైతే తన యజమాని కాపాడుకోవడానికి వాటి ప్రాణాలు కూడా లెక్కచేయకుండా పోరాడుతాయి.తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి కేరళ రాష్ట్రంలోని ఓ శునకం తన యజమాని ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాన్ని త్యాగం చేసింది.

TeluguStop.com - తన యజమాని కోసం ప్రాణ త్యాగం చేసిన శునకం…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా చమంతపల్ అనే గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి అప్పు అనే శునకాన్ని పెంచుకుంటున్నాడు.ఇకపోతే తాజాగా తన యజమాని కుమారుడితో కలిసి ఇంటి పక్కన ఉన్న షాపులో పాలు తీసుకురావడానికి వెళ్ళాడు.

అయితే మార్గమధ్యంలో ఒక చోట ఎలక్ట్రికల్ వైర్ తెగిపడి ఉన్న విషయాన్ని ఆ శునకం గ్రహించి, తన యజమాని ఆ వైరును ఎక్కడ తొక్కుతాడో అని భావించి… తన యజమాని అక్కడికి చేరుకొనే లోపే ఆ వైర్ ని నోటితో కరుచుకొని పక్కకు పడేసే ప్రయత్నం చేసింది.అయితే దురదృష్టవశాత్తు ఆ వైర్ కు విద్యుత్ ప్రవాహం ఉండడంతో ఆ కుక్క అక్కడికక్కడే మరణించింది.

దీంతో ఆ కుటుంబ సభ్యులు మొత్తం షాక్ కు గురయ్యారు.

అయితే పూర్తి విషయం అర్థమైన తర్వాత ఆ కుటుంబ సభ్యులు శునకానికి పెద్ద ఎత్తున అంత్యక్రియలు నిర్వహించారు.

ఇందుకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా ద్వారా జంతు ప్రేమికులకు తెలియడంతో ఆ శునకం పట్ల వారు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.యజమాని ప్రాణం కాపాడిన ఆ శునకానికి నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

నిజానికి కుక్క కున్న విశ్వాసం మనిషికి కూడా లేదు అంటారు చాలామంది పెద్దవారు.మరికొంతమంది దుర్మార్గులు ఇంట్లో పెంచుకొనే జంతువులపై అఘాయిత్యాలకు పాల్పుడుతున్న సంఘటనలను కూడా మనం ఎన్నో చూస్తూ ఉన్నాం.

#Owner #Power #Kerala #Current #Died

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kerala Dog Electrocuted Death Saves Owner Life Related Telugu News,Photos/Pics,Images..