విడ్డూరం : అనారోగ్యం అంటూ డాక్టర్‌ వద్దకు వెళ్తే మద్యం తాగమని సలహా ఇచ్చాడు

దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ అమలులో ఉన్న విషయం తెల్సిందే.ఈ లాక్‌ డౌన్‌ సమయంలో దేశ వ్యాప్తంగా వైన్స్‌, బార్స్‌ కూడా మూత పడి ఉన్నాయి.

 Kerala Doctors, Prescription, Alcohol Drink,viral Post-TeluguStop.com

దేశంలో గతంలో ఎప్పుడు లేని విధంగా వైన్స్‌ మూత పడటంతో మందు బాబులు ఎంతగా హైరానా పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మందు దొరక్క కొందరు పిచ్చి వారు అవుతున్నారు.

మరికొందరు మందు కోసం దొంగతనాలు కూడా చేసేందుకు రెడీ అయ్యారు.తాజాగా కేరళలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పురుషోత్తం అనే ఒక వ్యక్తి కాళ్లు చేతులు విపరీతంగా గుంజడంతో పాటు తలంతా రోజు తిరుగుతున్నట్లుగా అనిపించడంతో పాటు శరీరం పూర్తిగా అదుపు తప్పినట్లుగా ఉంటుందని వైధ్యుడి వద్దకు వెళ్లాడట.వైధ్యుడు పురుషోత్తంకు గతంలో మందు తాగే అలవాటు ఉందని తెలుసుకుని ఈ పరిస్థితికి కారణం ఆల్కహాల్‌ లేకపోవడేమో అంటూ నిర్థారించాడట.

ప్రతి రోజు ఆల్కహాల్‌ తీసుకునే నీవు ఇప్పుడు దాన్ని తీసుకోక పోవడంతో నీవు మానసికంగా ఇంకా శారీరకంగా చాలా అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నావు.అందుకే నీకు ఈ సమయంలో అత్యవసరంగా ఆల్కహాల్‌ అవసరం అంటూ ప్రిస్కిప్షన్‌లో మందులకు బదులుగా ఆల్కహాల్‌ తీసుకో అంటూ రాసిచ్చాడు.

Telugu Alcohol, Kerala Doctors-Latest News - Telugu

ఈ విషయం కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో సదరు డాక్టర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి.ఒక బాధ్యత కలిగిన డాక్టర్‌ ఇలాగేనా ప్రవర్తించేది, కనీసం బాధ్యత లేకుండా మీరు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది అంటూ నెటిజన్స్‌ ఆయన్ను దుమ్మెత్తి పోశారు.దాంతో సదరు డాక్టర్‌ స్పందించాడు.తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పేందుకు బుకాయించాడు.ఇలాంటి సమయంలో కాస్త రిలాక్స్‌ కోసం జోక్‌ చేశాను అంతే అంటూ ఆ డాక్టర్‌ అన్నాడు.అసలు పురుషోత్తం అనే పేషంట్‌ తన వద్దకు రాలేదు అన్నాడు.

అయితే డాక్టర్‌ బుకాయిస్తున్నాడంటూ కొందరు అతడిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube