నిన్నటివరకు రోజుకూలీ... ఈరోజు కోటీశ్వరుడు... ఎలా అయ్యాడంటే..?  

kerala daily labour wins 12 crores money in lottery - Telugu 12 Crores Money, Kerala Daily Labour, Lottery

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేదు.కానీ అదృష్టం తలుపు తడితే మాత్రం ఒక్కరోజులోనే జీవితాలు మారిపోతాయి.

TeluguStop.com - Kerala Daily Labour Wins 12 Crores Money In Lottery

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కేరళ రాష్ట్రంలోని రోజు కూలీని లాటరీ రూపంలో అదృష్టం వరించింది.ఆ లాటరీ ఒక్కరోజులోనే అతని జీవితాన్ని మార్చేసింది.

పని చేస్తే గానీ పూట గడవని 55 సంవత్సరాల వయస్సు గల రోజు కూలీ ఒక్కరోజులో 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు.

పూర్తి వివరాలలోకి వెళితే కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా పురలిమాలా కురచియా కాలనీకి చెందిన రాజన్ దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగించేవాడు.జీవితంలో అదృష్టాన్ని పెద్దగా నమ్మని రాజన్ 20 రోజుల క్రితం ఒక లాటరీ సేల్ విపరీతంగా ఆకర్షించడంతో లాటరీ టికెట్ ను కొన్నాడు.300 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాననే విషయం ఇంట్లో తెలిస్తే ఇంట్లో అందరూ తిడతారని భావించిన రాజన్ తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు లాటరీ గురించి చెప్పలేదు.

***

మూడు రోజుల క్రితం లాటరీ సంస్థ విజేతలను ప్రకటించగా రాజన్ కొన్న లాటరీ టికెట్ కు ఏకంగా 12 కోట్ల రూపాయల ఫ్రైజ్ మనీ రావడంతో రాజన్ పట్టరాని ఆనందంతో తన కుటుంబ సభ్యులకు లాటరీలో 12 కోట్ల రూపాయల ఫ్రైజ్ మనీని సొంతం చేసుకున్న విషయాన్ని చెప్పాడు.కలలో కూడా లాటరీ ద్వారా 12 కోట్ల రూపాయలు తన సొంతమవుతాయని ఊహించలేదని వచ్చిన డబ్బులతో తన కూతురిని ఉన్నత చదువులు చదివిస్తానని మంచి ఇల్లు కట్టుకుంటానని అప్పులన్నీ తీర్చేస్తానని రాజన్ చెబుతున్నాడు.

ఇన్ని రోజులు తన ఏరియాలో కూడా పెద్దగా ఎవరికీ పరిచయం లేని రాజన్ ను ఇప్పుడు కురిచియా కాలనీ ప్రజలు కలిసి అభినందిస్తూ రాజన్ తో సెల్ఫీలు దిగుతున్నారు.

#12 Crores Money #KeralaDaily #Lottery

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kerala Daily Labour Wins 12 Crores Money In Lottery Related Telugu News,Photos/Pics,Images..