ఓరినీ మీ సోకు... ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు వెళ్లిన కొత్త జంట ఏమయ్యారో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు  

Kerala Couple Falls Into River From Boat On Pre-wedding Photoshoot -

క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కుతుంటే ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి అనే విషయం కేరళకు చెందిన కాబోయే భార్య భర్తలకు తెలిసి ఉంటుంది.అందరికంటే విభిన్నంగా ఉండాలని, విభిన్నంగా కనిపించాలని, ప్రత్యేకత చాటుకోవాలని భావించడం, ఆలోచించడం కామన్‌.

Kerala Couple Falls Into River From Boat On Pre-wedding Photoshoot

కాని కొందరు అందుకోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉంటారు.అదే చాలా సమస్యలను తెచ్చి పెడుతుంది.

తాజాగా కేరళలో జరిగిన ఒక ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో కాబోయే భార్య భర్తలకు ఎదురైన అనుభవం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ఓరినీ మీ సోకు… ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు వెళ్లిన కొత్త జంట ఏమయ్యారో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు-General-Telugu-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఈమద్య కాలంలో ఉన్న వారితో పాటు మద్య తరగతి వారు కూడా పెళ్లిల్లో ప్రీ వెడ్డింగ్‌ వీడియోలను ప్రసారం చేస్తున్నారు.

అంటే నిశ్చితార్థం పూర్తి అయిన తర్వాత అమ్మాయి మరియు అబ్బాయిలతో ఒక వీడియోను షూట్‌ చేస్తారు.ఆ వీడియో చాలా రొమాంటిక్‌గా, కొత్త జంట ప్రేమకు అద్దం పట్టేలా ఉంటుంది.

ఫొటోగ్రాఫర్స్‌ ఆ వీడియో హైలైట్‌గా రావాలనే ఉద్దేశ్యంతో చాలా కష్టపడి పోతూ ఉంటారు.ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ పేరుతో కిందా మీదా పడుతూ ఉంటారు.తాజాగా కేరళలో తిజిన్‌ మరియు శిల్పలు పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యారు.వారి ప్రీ వెడ్డింగ్‌ వీడియోను ప్లాన్‌ చేశారు.

ప్రీ వెడ్డింగ్‌ వీడియో కోసం చాలా ప్రత్యేకంగా ఉండాలని చిన్న బోట్‌లలో షూట్‌ చేయాలనుకున్నారు.సినిమా షాట్స్‌ తరహాలో అమ్మాయి మరియు అబ్బాయిని ఒక చిన్న బోట్‌లో నిలబెట్టి టైటానిక్‌ షాట్‌ తీయాలని వీడియోగ్రాఫర్‌ భావించాడు.అందుకోసం పూర్తి ఏర్పాట్లు చేయలేదు.ఏం పర్వాలేదులే అనుకున్నాడు.అయితే అమ్మాయి అబ్బాయి నిల్చున బోటు బ్యాలన్స్‌ తప్పి ఆ కాబోయే జంట నీటిలో పడిపోయారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలని పెద్దలు అంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kerala Couple Falls Into River From Boat On Pre-wedding Photoshoot- Related....