వీడియో : కూతురు పెళ్లిలో కుప్ప కూలిన కన్నతండ్రి... ఇది చూస్తే కన్నీళ్లు ఆగవు  

Kerala Cop Sings On Eve Of Daughter’s Wedding, Collapses On Stage And Dies -

ఏ తండ్రికి అయినా కూతురు పెళ్లి చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది.కొడుకు పెళ్లి కంటే కూతురు పెళ్లిని ప్రతి తండ్రి చాలా బాధ్యతతో తీసుకుంటాడు.

Kerala Cop Sings On Eve Of Daughter’s Wedding, Collapses On Stage And Dies

కూతురు పెళ్లి చేస్తే ఒక గొప్ప పని చేసినట్లుగా, గొప్ప కార్యక్రమం చేసినట్లుగా, జీవితంలో మరో ఉన్నత స్థాయికి చేరినట్లుగా తండ్రి భావిస్తాడు.అలాంటి కూతురు పెళ్లి కార్యక్రమంలో తండ్రి సంతోషంతో పొంగి పోతూ అదే సమయంలో గుండె ఆగిపోయింది.

సంతోషంతో అతడి గుండె ఆగడంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న పెళ్లి మండపం ఒక్కసారిగా శోఖమయంగా మారిపోయింది.

వీడియో : కూతురు పెళ్లిలో కుప్ప కూలిన కన్నతండ్రి… ఇది చూస్తే కన్నీళ్లు ఆగవు-General-Telugu-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

కేరళ రాష్ట్రం కొల్లాంకు సమీపంలో ఉండే కర్మనా అనే ప్రాంతంలో ఎస్‌ఐగా విష్ణు ప్రసాద్‌ పని చేస్తుంటాడు.తన కూతురును మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్దం అయ్యాడు.

పెళ్లి అంతా అంగ రంగ వైభవంగా సాగుతోంది.తన కూతురు పెళ్లిని అందరు కూడా అబ్బా అనుకునేలా చేయాలని చాలా ఏర్పాట్లు చేశాడు.

వచ్చిన బంధు మిత్రుల ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశాడు.అప్పుడప్పుడు పాడటం అలవాటున్న విష్ణు ప్రసాద్‌ తన కూతురు పెళ్లిలో పాడకుంటే ఎలా అనుకున్నాడేమో పాట అందుకున్నాడు.

ఒక పాటను విష్ణు ప్రసాద్‌ పాడుతుండగా ఆర్కెస్ట్రా బ్యాచ్‌ వాయిస్తున్నారు.విష్ణు ప్రసాద్‌ పాట పాడుతుంటే ఎంతో మంది వీడియోలు తీస్తున్నారు.అందరిలో జోష్‌ నింపే విధంగా ఆయన పాట ఉంది.ఆయన పాటకు అంతా కూడా పరవసించి పోతున్న సమయంలో ఒక్కసారిగా స్టేజ్‌పై కుప్పకూలి పోయాడు.నవ్వుతున్న వ్యక్తి నవ్వుతున్నట్లుగానే కింద పడిపోయాడు.విష్ణు ప్రసాద్‌ను వెంటనే హాస్పిటల్‌కు తీసుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందట.

ఆయన అప్పటికే చనిపోయాడని, గుండె పోటు అంటూ వైధ్యులు చెప్పారు.కూతురు పెళ్లి చేస్తున్న సంతోషంలో అతడి గుండె ఆగినట్లుగా చెబుతున్నారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kerala Cop Sings On Eve Of Daughter’s Wedding, Collapses On Stage And Dies- Related....