బన్నీ ని అభినందించిన కేరళ సర్కార్  

Kerala Cm Pinarayi Vijayan Praises Allu Arjun - Telugu Allu Arjun, Covid-19, Donations, Kerala, Kerala Cm Pinarayi Vijayan

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచదేశాలతో పాటు భారత్ కూడా చిగురుటాకులా వణికిపోతున్న సంగతి తెలిసిందే.దీనితో భారత్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ప్రకటించడం తో రోజువారీ కూలీల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురుకొంటున్నారు.

 Kerala Cm Pinarayi Vijayan Praises Allu Arjun

దీనితో రాజకీయ నాయకులు, సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇస్తున్నారు.ఈ క్రమంలో ఫిల్మ్ స్టార్స్ కూడా తమ వంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ లు అందించారు.

అయితే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రం కూడా తన వంతు సాయం అందించారు.ఈ నేపథ్యంలో తమ రాష్ట్రం ను కూడా మర్చిపోకుండా కరోనా నిర్మూలనకు చేయూతనిచ్చిన అల్లు అర్జున్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలతో సమానంగా తమను కూడా ఆదుకోవాలన్న బన్నీ ఆలోచన గొప్పదంటూ కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశంసించారు.కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అంటూ ప్రకటించడం తో తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు ఇచ్చిన బన్నీ కేరళ రాష్టం కు కూడా 25 లక్షలు ఫండ్ ని అందించారు.

బన్నీ ని అభినందించిన కేరళ సర్కార్-General-Telugu-Telugu Tollywood Photo Image

దీనితో ఆయన మొత్తం కోటి ఇరవై అయిదు లక్షలు విరాళం ప్రకటించినట్లు తెలుస్తుంది.తమకు అందిన సాయాన్ని ధృవీకరించిన కేరళ సర్కార్.బన్నీ చేసిన సాయాన్ని కేరళ ప్రజలు మరిచిపోరని ఈ ఆపత్కాలంలో మద్దతుగా నిలిచినందుకు రుణపడివుంటారని తెలిపారు కేరళ సీఎం పినరయి విజయన్.

అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాలతో సమానంగా మలయాళ ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్ స్టార్ గా వెలిగే బన్నీ మల్లు స్టార్ గా మలయాళ ప్రేక్షుకుల అభిమానం సంతరించుకున్నారు.బన్నీ చిత్రాలు అక్కడ కూడా మంచి వసూళ్ల ను రాబెడుతూ ఉంటాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kerala Cm Pinarayi Vijayan Praises Allu Arjun Related Telugu News,Photos/Pics,Images..