కాంగ్రెస్ పై సీరియస్ కామెంట్లు చేసిన కేరళ ముఖ్యమంత్రి..!!

కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.కేరళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కె సుధాకరన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో… విజయన్… గతంలో ఇదే సుధాకరన్… తన పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు చేశారు.

ఈ విషయమై ఇప్పటి వరకు ఎవరితోనూ పంచుకోలేదని.సుధాకరన్ స్నేహితుడు ఒకరు గతంలో తన ఇంటికి వచ్చేవాడని, ఆ టైంలో తన పిల్లలను పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో కిడ్నాప్ చేయడానికి సుధాకరన్…పెద్ద స్కెచ్ వేశాడు అని సదరు వ్యక్తి తనతో తెలపడం జరిగిందని పేర్కొన్నారు.ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి అన్న దాని విషయంలో పినరయి విజయన్ చెప్పలేదు.అంతే కాకుండా ఇప్పటి వరకు ఈ విషయం తన భార్యకు కూడా తెలియదని ఆమె భయపడుతుంధేమో అన్న ఉద్దేశంతో అప్పట్లో తెలపటం జరగలేదని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేరళ కాంగ్రెస్ కే సుధాకరన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Kerala Cheif Minister Serious Comments On Congress-కాంగ్రెస్ పై సీరియస్ కామెంట్లు చేసిన కేరళ ముఖ్యమంత్రి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Congress #Kerala CM

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు