కేరళ ఛాయ్ వాలా సూపర్ ఐడియా..వరద నీతితో ఏం చేస్తున్నాడు అంటే.? వైరల్ గా మారిన వీడియో.!

గత కొన్ని రోజుల నుండి కేరళలో ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో అందరికి తెలిసిందే.వర్షాలు, వరదలు వల్ల ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

దేశ ప్రజలంతా ప్రాంతీయ భేదాలు మరిచి సహాయం చేసి మనమంతా ఒక్కటే అని చాటి చూపారు.వరదల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తి పాస్తులు, ఇల్లు కోల్పోయి నిరుపేదలుగా మారారు.

వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం.వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

ఒకవైపు సహాయక చర్యలు నిర్వహిస్తున్న సైనికులకు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్న సమయంలో ఓ చాయ్ వాలా ఉన్న చోట నుంచి కాలు కదపకుండా వరద భాధితులకు ఛాయ్, బ్రెడ్ అందిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

Advertisement

గ్లాస్ లలో చాయ్ నింపి.ఓ ట్రేలో పెట్టి.ఆ ట్రేను నీళ్లపై ఉంచి దూరంగా ఉన్నవాళ్ల దగ్గరకు పంపిస్తున్నాడు.

వరద నీటిని ఉపయోగించుకొని వరద బాధితులకు సర్వీస్ చేస్తున్న అతడిని సోషల్ మీడియా మెచ్చుకుంటోంది.మీరు సామాన్యులు కాదు సార్.

ప్రతికూల పరిస్ధితులని కూడా మీకనుగుణంగా మార్చుకొనే టాలెంట్ మీది అంటూ అతడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఆ వీడియో మీరు ఒక లుక్ వేయండి! .

కొరటాల శివ ఆ స్టార్ హీరో తో సినిమా చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు