కేరళ: బడ్జెట్‌లో ఎన్ఆర్ఐలకు ప్రత్యేక పథకాలు.. ‘‘నెవ్వర్ బి ఫోర్..ఎవ్వర్ ఆఫ్టర్’’

గల్ఫ్ ఆర్ధిక వ్యవస్ధలో తిరోగమనంతో పాటు ప్రవాసులు తిరిగి భారతదేశానికి వచ్చే ప్రమాదం ఉన్నందున కేరళ ఆర్ధిక మంత్రి టీఎం థామస్ ఐజాక్ ఎన్ఆర్ఐల పునరావాసం కోసం బడ్జెట్‌లో సాయాన్ని ప్రకటించినట్లుగా కనిపిస్తుంది.దీనిలో భాగంగా ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం 90 కోట్లను కేటాయించాలని బడ్జెట్‌లో నిర్ణయించారు.ఇది కాకుండా నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వ్యవహారాల శాఖ ( నోర్కా) కోసం అదనంగా రూ.36 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించినట్లు మంత్రి తెలిపారు.ప్రభుత్వ ప్రతిపాదనలను అభినందిస్తూ యూఏఈకి చెందిన ప్రవాసి బంధు సంక్షేమ ట్రస్ట్ ఛైర్మన్ కేవీ.శామ్‌సుధీన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

 Kerala Budget 2020 Nri Welfare Finds Space In Tm Thomas Isaac Budget-TeluguStop.com

ఎన్ఆర్ఐల ప్రాముఖ్యతతో పాటు కేరళ అభివృద్ధికి వారు పంపే డబ్బు విలువను ప్రభుత్వం గుర్తించిందన్నారు.కేఐఐఎఫ్‌బీ, ప్రవాసి చిట్టి ద్వారా రూ.20,000 కోట్లను సమీకరించే ప్రతిపాదన… తిరోగమనంలో ఉన్న ఆర్ధిక వ్యవస్ధకు ఉద్దీపన ఇస్తుందని ఆయన అన్నారు.పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన ప్రకారం కేఐఐఎఫ్‌బీ వంటి సంస్థలలో పెట్టుబడులతో, నోర్కా సంస్థ రూపొందించిన సంక్షేమ పెన్షన్ పథకాన్ని విలీనం చేస్తారు.

ఈ పథకం ప్రకారం.రూ.5 లక్షలు లేదా రెట్టింపు పెట్టుబడి పెడితే, ఐదేళ్ల తరువాత స్థానికేతరులు లేదా వారి వారసులు పెట్టుబడి ఆధారంగా నెలవారీ ఆదాయంగా నిర్ణీత మొత్తాన్ని పొందుతారు.

Telugu Budget, Kerala, Keralabudget, Telugu Nri, Welfare Funds-

అదే విధంగా ఎన్ఆర్ఐల పొదుపును ప్రవాసి చిట్టి ద్వారా రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించుకునేందుకు కేఎస్ఎఫ్ఈ రూపొందించిన డివిడెండ్ పథకాన్ని ఫిబ్రవరి నాటికి ఇతర గల్ఫ్ దేశాలకు తర్వాత ఇతర దేశాలకు విస్తరిస్తారు.ప్రస్తుతం ప్రవాసి చిట్టి యూఏఈలో మాత్రమే ప్రారంభించబడిందని బడ్జెట్ తెలిపింది.ఆదాయం రూ.1.5 లక్షల కన్నా తక్కువ ఉన్న ఎన్ఆర్ఐలు తిరిగి స్వదేశానికి వచ్చేస్తే.అత్యవసర పరిస్థితుల్లో ఆర్ధిక సహాయం అందించే లక్ష్యంతో ఉద్దేశించిన ‘‘సాంత్వనం ప్రాజెక్ట్’’‌ కోసం రూ.27 కోట్లు కేటాయించారు.దీనితో పాటు ప్రవాస పారిశ్రామికవేత్తలకు మూలధనం మరియు వడ్డీ రాయితీని ఇవ్వడానికి రూ.18 కోట్లు కేటాయించారు.

అంతేకాకుండా కేరళ నాన్ రెసిడెంట్ కేరలైట్ వెల్ఫేర్ బోర్డుకు రూ.9 కోట్లు, నోర్కా బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్‌తో పాటు ఎన్ఆర్ఐ సంస్ధలకు వేరు వేరుగా రూ.2 కోట్లు లభిస్తాయి.ఎన్ఆర్ఐ కుటుంబాలలోని సీనియర్ సిటిజన్ల కోసం కేర్- హోమ్ పథకం లేదా ‘‘ గార్డెన్ ఆఫ్ లైఫ్ ప్రాజెక్ట్’’వంటి కొత్త ప్రతిపాదనలను ఈ ఏడాది బడ్జెట్‌లో పొందుపరిచారు.

దీనితో పాటు 3 కోట్ల వ్యయంతో 24 గంటల హెల్ప్‌లైన్, లీగల్ సెల్ ఏర్పాటు వంటివి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఎయిర్‌పోర్ట్ అంబులెన్స్, తరలింపు సౌకర్యాల కోసం 1.5 కోట్లు కేటాయించారు.దీంతో ఇక నుంచి గల్ఫ్ దేశాలలో మరణించిన మలయాళీల మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి అయ్యే ఖర్చును నార్కా భరిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube