నవ్వులు పోయి నువ్వులు అంటే ఇదే... పెళ్లిలో సరదా కామెంట్‌తో వరుడు హర్ట్‌ అయ్యి ఏం చేశాడో తెలుసా?     2019-01-12   09:55:43  IST  Ramesh Palla

తెలుగులో నవ్వులు పోయి నువ్వులు అవుతాయనే సామెత ఉంది. ఈ సామెతకు అర్థం ఏదైనా సరదాగా చేసే పని శృతి మించితే గొడవకు దారి తీస్తుంది అని, ఇంకా క్లీయర్‌ గా చెప్పాలంటే నవ్వుకుంటూ మాట్లాడుతూ మాట్లాడుతూ కొట్టుకోవడం అన్నట్లు. ఇదే సంఘటన కేరళలో ఒక పెళ్లిలో జరిగింది. పెళ్లి కొడుకును మిత్రులు సరదాగా ఆటపటిస్తుంటే ఆ పెళ్లి కొడుకు కాస్త సీరియస్‌ అయ్యాడ. పెళ్లి కూతురు అత్యుత్సాహంతో కాస్త కామెడీ చేయాలనుకుంటే అది కాస్త అడ్డదిడ్డంగా మారిపోయింది.

Kerala Bride Groom Hurted In Marriage-Bride Marriage Wedding Parties

Kerala Bride Groom Hurted In Marriage

సాదారణంగా పెళ్లిల్లో వధు వరులను మిత్రులు మరియు బంధువులు ఆట పటిస్తూ ఉంటారు. కేరళలో సాంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత ఒకే ఆకులో వధు వరులు ఇద్దరు కలిసి బోజనం చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో వధువుకు మరిది, మరదల్లు అయ్యే వారు మరియు వరుడికి బావ, మరదలు, బామర్థి అయ్యే వారు ఆటపటిస్తూ ఉంటారు. అలాగే ఆ పెళ్లిలో కూడా వధు వరుడు ఇద్దరు కూడా బోజనంకు కూర్చున్నారు. ఇద్దరు కలిసి బోజనం చేసేందుకు సిద్దం అయిన సమయంలో వరుడి తరపు వారు వధువుకు గ్లాస్‌ పెట్టకుండా ఆమెకు వాటర్‌ ఇవ్వకుండా ఆట పటించారు. తనకు వాటర్‌ ఇవ్వక పోవడంతో వరుడికి బోజనం పెట్టకుంటా నేనొక్కదాన్నే తింటానంటూ గడుసుగా సమాధానం చెప్పింది.

ఆకు మద్యలో పెట్టిన బోజనం మొత్తం తనవైపుకు లాక్కుంది. బోజనం వధువు లాగేసుకోవడంతో వధువు తరపు వారు పెద్ద ఎత్తున మొత్తుకుని వరుడిని గేలి చేసినట్లుగా కామెంట్‌ చేశారు. నవ్వుతూ ఉన్నట్లుగానే అనిపించిన వరుడు చూస్తుండగానే సీరియస్‌ అయ్యి ముందు ఉన్న టేబుల్‌ను విసిరి కొట్టి వెళ్లి పోయాడు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు కాని, ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Kerala Bride Groom Hurted In Marriage-Bride Marriage Wedding Parties

ఏదైనా హద్దు మించితే ఇలాగే ఉంటుందనేందుకు ఇదో ప్రత్యేక నిదర్శణం. కాని పెళ్లి రోజే మరీ ఇంత కోపం చూపితే ఆ వధువు పరిస్థితి ఏంటో అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. అలా నెట్టి వేసిన తర్వాత ఏం జరిగిందనేది వీడియోలో లేదు. దాంతో జనాలు ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందా అంటూ తమకు తోచిన విధంగా ఎవరికి వారు అంచనాలు వేసేసుకుంటున్నారు.

https://www.facebook.com/officialorangemedialive/videos/2078866632151360/?t=99